1 April, 2026 | 6:29 PM

Breaking News

అంబేద్కర్ సెంటర్ కమిటీ ఎన్నికల షెడ్యూల్ విడుదల   •   అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తాం   •   సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేసిన 14వ డివిజన్ కార్పొరేటర్ గడ్డి ప్రదీప్   •   మున్సిపల్ చైర్ పర్సన్ నివేదితను కలిసిన ఆర్యవైశ్యులు   •   గర్రెపల్లిలో సీసీ రోడ్డు నిర్మాణం పనులు ప్రారంభం   •   హైదరాబాద్ డివై డిఎంహెచ్ఓ డాక్టర్ శ్రావణ్ కుమార్   •   మంథనిలో రన్ ఫర్ జీసస్ ను విజయవంతం చేయండి   •   మధ్యాహ్న భోజన పథకాన్ని డిగ్రీ వరకు విస్తరించాలి   •   మృతుని కుటుంబానికి గ్రామస్తులు ఆర్థిక సాయం   •   లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలి   •  

పోలీసుల సమక్షంలోనే దాడికి తెగబడడం దారుణం

11-10-2025 08:45 PM

ఇసుక ర్యాంప్ అనుమతులను వెంటనే రద్దు చేయాలి..

జిల్లా కాంగ్రెస్ నాయకులు గురజాల..

మణుగూరు (విజయక్రాంతి): పోలీసుల సమక్షంలోనే ఇసుక ర్యాంపు నిర్వాహకుడు సామాన్య రైతుపై దాడికి తెగబడడం దారుణమని, అధికారులు వెంటనే ఇసుక ర్యాంప్ అనుమతులను రద్దు చేయాలని, జిల్లా కాంగ్రెస్ నాయకులు గురజాల గోపి డిమాండ్ చేశారు. శనివారం రేణుక చౌదరి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గోపి మాట్లాడారు. కమలాపురం గ్రామస్తులు ఇసుక లారీలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, స్కూలు విద్యార్థులు, రైతులకు లారీలతో ఇబ్బందికరంగా మారిందని పేర్కొన్నారు.

సమస్యను పరిష్కరించాల్సిన ఇసుక ర్యాంపు బినామీ గంటా రమేష్ పోలీసుల సమక్షంలోనే బాధితుడుపై తీవ్రంగా దాడి చేయడం సమంజసం కాదని, దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే ఉపేక్షించబోమని హెచ్చరించారు. కమలాపురం ఇసుక ర్యాంపు అనుమతులను రద్దుచేసి గ్రామస్తుల సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు ఎండి షరీఫ్ పింగళి మాధవరెడ్డి, చారి, రేణుక అక్షర మహిళా మండలి అధ్యక్షురాలు పూనం సరోజ, ఎండి షబానా, కోరి శ్యామల, రెడ్డి బోయిన రేణుక, కన్నాపురం వసంత, శైలజ, డాకూరి సౌజన్య పాల్గొన్నారు.