ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలి
- కొండపాక మండల తహసిల్దార్ మల్లికార్జున్ రెడ్డి
కొండపాక: కొండపాక మండలం వెలికట్ట గ్రామంలో బుధవారం గ్రామ పంచాయతీ వద్ద సర్పంచ్ బూర్గుల మానస సురేందర్రావు ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా కొండపాక మండల తాహసిల్దార్ మల్లికార్జున్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామంలోని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వ్యాధుల బారిన పడకుండా ఉండాలని, గ్రామంలో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని సూచించారు.
పంట మార్పిడి పై అవగాహన కార్యక్రమాలను కల్పించడం జరిగిందని, ఏవైనా రెవెన్యూ సమస్యలు ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తానని తెలిపారు. ఫ్యాక్స్ డైరెక్టర్ బూర్గుల సురేందర్రావు మాట్లాడుతూ గ్రామసభలో పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించామని, ప్లాస్టిక్ నిషేధం కోసం ప్రజలు సహకరించాలని గ్రామ ప్రజలను కోరారు.






