7 July, 2026 | 7:32 PM

Breaking News

డిగ్రీ ప్రవేశాల్లో రాష్ట్రంలో ప్రథమ స్థానం   •   ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలిసిన వివిధ గ్రామ సర్పంచులు   •   గట్టుదుద్దెనపల్లి సంఘం చైర్మన్ గా గంగుల రామ్ రెడ్డి   •   సర్ ప్రక్రియపై ఓటర్లకు అవగాహన కార్యక్రమం   •   నాగిరెడ్డిపేట్ గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీల సంఖ్య పెంచాలి   •   17వ వార్షికోత్సవ వేడుకలకు ముస్తాబైన సుల్తానాబాద్ సాయిబాబా దేవాలయం   •   ఘనంగా ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు   •   అనగారిన వర్గాల... అభ్యున్నతి ఎమ్మార్పీఎస్ తోనే సాధ్యం   •   ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు   •   ఇందిరమ్మ ఇండ్ల వద్ద కరెంటు స్తంభాలు ఏర్పాటు   •  

విద్యుత్ ఉప కేంద్రాల మంజూరు

18-11-2025 12:00 AM

 ఎమ్మెల్యే జారే వెల్లడి

ములకలపల్లి / దమ్మపేట,నవంబరు 17 (విజయక్రాంతి):అశ్వరావుపేట నియోజకవర్గానికి మరో రెండు కొత్త 33/11 కెవి విద్యుత్తు ఉప కేంద్రాలు మంజూరైనట్లు అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ వెల్లడించారు. సోమవారం ఆయన దమ్మపేట మండలంలోని గండు గులపల్లి క్యాంప్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. దమ్మపేట మండలంలోని మల్లారం, జగ్గారం గ్రామాల్లో విద్యుత్ ఉప కేంద్రాల నిర్మాణం కోసం 5కోట్ల 27 లక్షల 82 వేల రూపాయల నిధులు మంజూరైనట్లు తెలిపారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు విద్యుత్ సమస్య పరిష్కారం కోసం దమ్మపేట మండలంలోని మల్లారం ,జగ్గారం గ్రామాల్లో 33/11 కెవి సబ్ స్టేషన్లను మంజూరు చేయించినట్లు చెప్పారు. వీటి నిర్మాణం పూర్తయితే ఆయా ప్రాంతాల ప్రజలకు ముఖ్యంగా రైతులకు విద్యుత్ పరంగా ఉన్న సమస్యలు పూర్తిగా తొలగిపోతాయని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ తెలియజేశారు.

నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా అందుబాటులోకి రానుందని సమస్యను ప్రభుత్వానికి విన్నవించడంతో విద్యుత్ ఉప కేంద్రాలను మంజూరు చేయడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఉపముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్కకు ఆయన కృతజ్ఞతలు చెప్పారు, ఈ కార్యక్రమంలో దమ్మపేట మండల అధ్యక్షులు సత్యప్రసాద్,మాజీ సర్పంచ్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.