17 June, 2026 | 10:50 PM

ఆర్. కృష్ణయ్య ఉద్యమ జీవిత చరిత్ర పుస్తక ఆవిష్కరణ.

17-06-2026 09:10 PM

రాజాపూర్: మండల కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద బీసీ దళపతి, రాజ్యసభ సభ్యులు ఆర్, కృష్ణయ్య ఉద్యమ జీవిత చరిత్ర పుస్తకాన్ని బీసీ జాగృతి సేన జిల్లా అధ్యక్షులు జెనిగల శేఖర్ యాదవ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జెనిగల శేఖర్ యాదవ్ మాట్లాడుతూ... బీసీల హక్కుల సాధన కోసం ఆర్. కృష్ణయ్య దశాబ్దాలుగా నిరంతరం పోరాటం చేస్తున్నారని తెలిపారు. విద్య, ఉపాధి, రాజకీయ రంగాలలో బీసీలకు సముచిత ప్రాధాన్యం కల్పించేందుకు ఆయన చేసిన సేవలు యువతకు ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. బీసీ సమాజ అభ్యున్నతికి ఆర్. కృష్ణయ్య చేసిన కృషిని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆయన జీవిత చరిత్ర పుస్తకం యువతలో సామాజిక చైతన్యాన్ని పెంపొందిస్తుందని అన్నారు. బీసీల సాధికారత కోసం అందరూ ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.