పీఎం శ్రీ పాఠశాలలో ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ పంపిణీ
17-06-2026 08:56 PM
కోనరావుపేట,(విజయక్రాంతి): పీఎం శ్రీ ఎంపీపీఎస్ కోనరావుపేట పాఠశాలలో బుధవారం ఒకటి నుండి ఐదవ తరగతి వరకు విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోనరావుపేట గ్రామ సర్పంచ్ మస్కూరి కాశీరాం, మండల విద్యాధికారి మురళి నాయక్ విద్యార్థులకు పుస్తకాలు, నోట్‌బుక్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న విద్యా సదుపాయాలను సద్వినియోగం చేసుకుని విద్యలో రాణించాలని సూచించారు. విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో పాఠ్యపుస్తకాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయులు ఉత్తం విజయ్ కుమార్, ఉపాధ్యాయులు భాస్కర్, రాము, వెంకటేష్, సంజీవ్, శృతి తదితరులు పాల్గొన్నారు.






