1 August, 2026 | 5:06 AM

మీ సేవకు సలాం

01-08-2026 12:00 AM

5వ కమాండెంట్ సుబ్రహ్మణ్యానికి ఘనంగా వీడ్కోలు పలికిన అధికారులు 

గోవిందరావుపేట, జులై 31 (విజయక్రాంతి): ఉద్యోగ బాధ్యతల్లో నిజాయితీగా ఉంటూ నిబద్దలతో అందరికీ ఆదర్శంగా నిలుస్తూ ఎంతోమందికి మందికి 5వ బెటాలియన్ కమాండెంట్ సుబ్రహ్మణ్యం స్ఫూర్తి ని ఇచ్చారని పలురువక్తులు కొనియాడారు. ములుగు జిల్లా చల్వాయిలోని తెలంగాణ స్పెషల్ పోలీస్ 5వ బెటాలియన్ కమాండెంట్ సుబ్రహ్మణ్యం ఉద్యోగ విరమణ సందర్భంగా శుక్రవారం ఘనంగా వీడ్కోలు పలికారు. 

కమాండెంట్ సుబ్రహ్మణ్యంకి బెటాలియన్ అధికారులు వీడ్కోలు పరేడ్ నిర్వహించారు. కార్యక్రమంలో బెటాలియన్ అధికారులు అదనపు కమాండెంట్ సీతా రాం, సహాయ కమాండెంట్లు కృష్ణ ప్రసాద్, ధర్మారావు, ఆర్.ఐలు, కిరణ్, భాస్కర్, స్వామి, శ్రీధర్, సాయిబాబు, వెంకటేశ్వర్లు, సిబ్బంది, పోలీసు అధికారులు, పోలీసు సిబ్బంది, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.