9 August, 2026 | 1:47 AM

గాయంతో సాయిసుదర్శన్ ఔట్

09-08-2026 12:00 AM
  1. లంకతో సిరీస్‌కు దూరం
  2. సర్ఫరాజ్, పటిదార్, రుతురాజ్‌లో ఒకరికి ఛాన్స్

బెంగళూరు, ఆగస్టు 8 : భారత క్రికెట్ జట్టును గాయాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే గాయాల కారణంగా బుమ్రా, నితీశ్ రెడ్డి, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్ శ్రీలంక పర్యటనకు దూరమవగా ఆ జాబితాలో మరో ఆటగాడు చేరాడు. కీలక బ్యాట ర్ సాయి సుదర్శన్ కూడా లంకతో టెస్ట్ సిరీస్ నుంచి తప్పుకున్నాడు. నిర్ణీత సమయంలో గాయం నుంచి పూర్తిగా కోలుకో కపోవడంలో సుదర్శన్ విఫలమైనట్లు తెలిసింది. దీంతోఈ సిరీస్ నుంచి అతన్ని తప్పిం చారు. సాయి సుదర్శన్ స్థానంలో మరో ఆటగాడిని శ్రీలంక పంపించనున్నారు. లంక తో రెండు టెస్టుల సిరీస్‌కు ముందు ప్రకటించిన 15 మంది జాబితాలో సాయి సుదర్శన్ పేరున్నప్పటకీ ఫిట్‌నెస్ ఆధారంగా అతను ఆడడంపై నిర్ణయం ఉంటుందని బీసీసీఐ తెలిపింది.

రిహాబిలిటేషన్‌లో పూర్తి ఫిట్‌నెస్ సాధించకపోవడంతో అతను దూరమయ్యా డు. ఇటీవల జూన్‌లో భారత్ ఏ జట్టు తరపున శ్రీలంక ఏ జట్టుపై సుదర్శన్ అద్భుతం గా రాణించాడు. రెండు అనధికారిక టెస్టుల్లోనూ సెంచరీలు సాధించాడు. ఆ సమ యంలోనే గాయపడి ఇప్పుడు ప్రధాన సిరీస్‌కు దూరమవడంతో టీమిండియాకు ఎదు రుదెబ్బగానే చెప్పాలి. బుమ్రా కూడా ఫిట్‌నెస్ సాధించకపోవడంతో అతన్ని తప్పించి అకీబ్ నబీదార్‌ను ఎంపిక చేశారు. ఇదిలా సాయిసుదర్శమ్ స్థానంలో సర్ఫరాజ్ ఖాన్, రజత్ పటిదార్, రుతురాజ్ గైక్వాడ్‌లో ఒకరికి చోటు దక్కే అవకాశముంది.