9 August, 2026 | 4:06 AM

శతక్కొట్టిన పడిక్కల్

09-08-2026 12:00 AM
  1. జడేజా హాఫ్ సెంచరీ
  2. నిరాశ పరిచిన జైస్వాల్, పంత్, జురెల్
  3. లంక ఎలెవన్‌పై భారత్ స్కోరు 357/6

కొలంబో, ఆగస్టు 8 : శ్రీలంక ఎలెవన్‌తో జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌లో వన్‌డౌన్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ సెంచరీతో అదరగొట్టాడు. కీలక బ్యాటర్లు విఫలమైన వేళ అ ద్భుతమైన ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు. ఓవ ర్ నైట్ స్కోరు 363/8 దగ్గరే లంక ఎలెవన్ డిక్లేర్ చేయడంతో రెండోరోజు భారత్ బ్యా టింగ్ ప్రారంభించింది. రెండో బంతికే ఓపెనర్ యశస్వి జైస్వాల్ డకౌటయ్యాడు. తర్వా త కెఎల్ రాహుల్‌తో కలిసి పడిక్కల్ ఇన్నిం గ్స్ నడిపించాడు. వీరిద్దరూ రెండో వికెట్ కు 96 పరుగులు జోడించారు.

రాహుల్ 40 పరుగుల దగ్గర ఔటవగా తర్వాత పడిక్కల్, జడేజా పార్టనర్ షిప్ భారత్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టింది. అనూహ్యంగా నాలుగో స్థానం లో బ్యాటింగ్‌కు వచ్చిన జడేజా, పడిక్కల్ తో కలిసి లంక బౌలర్లపై ఆధిపత్యం కనబరిచా డు. ఈ క్రమంలో ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. పడిక్కల్ చాలా రోజుల తర్వాత రెడ్‌బాల్ క్రికెట్‌లో మంచి ఇన్నింగ్స్ ఆడాడు. జడేజా, పడిక్కల్ మూడో వికెట్‌కు 72 పరుగులు జోడించారు. పడిక్కల్ సెంచ రీ పూర్తి చేసుకుని మిగిలిన బ్యాటర్లకు ప్రాక్టీ స్ కావాలన్న ఉద్దేశంతో రిటైర్డ్ హర్ గా వెనుదిరిగాడు.

అయితే అంచనాలు పెట్టుకున్న రిషబ్ పంత్ (2), ధృవ్ జురెల్ (1) నిరాశపరిచారు. ఈ దశలో జడేజాతో కలిసి మానవ్ సుతార్ 76 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. సుతార్ 40 ఔటవగా, జడేజా 63 పరుగుల దగ్గర రిటైర్డ్ హర్ట్ గా పెవిలియన్‌కు వెళ్లాడు.అనంతరం పడిక్కల్ మళ్లీ బ్యా టింగ్‌కు వచ్చి స్కోరు పెంచాడు. చివర్లో సారాంశ్ జైన్ (26), గుర్నూర్ బ్రార్ మెరుపులతో స్కోరు 350 దాటింది. బ్రార్ 18 బంతుల్లోనే 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 36 పరుగులు చేయగా, పడిక్కల్ 142 (18 ఫోర్లు) పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు.

దీంతో రెండోరోజు ఆటముగిసే సమయానికి భార త్ 6 వికెట్లకు 357 పరుగులు చేసింది. లంక ఎలెవన్ బౌలర్లలో రమేశ్ మెండిస్ 2, అసం క మనోజ్ 2 వికెట్లు పడగొట్టారు. లంక ఎలెవన్ స్కోరు ఇంకా 6 పరుగులు వెనుకబడిన భారత్ మూడోరోజు మరింత బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసుకునే అవకాశముంది. ఇదిలా ఉంటే కెప్టెన్ గిల్ గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో బ్యాటింగ్ కు దిగలేదు. అయితే తొలి టెస్ట్ సమయానికి అతను కోలుకుంటాడని టీమ్ మేనేజ్ మెంట్ ఆశాభావంతో ఉంది.

స్కోరు బోర్డు

శ్రీలంక ఎలెవన్ ఇన్నింగ్స్ : 363/8 డిక్లేర్డ్ (నిశాన్ 66, రవిందు 71, సూరియబండార 35, రత్నాయకే 39, దినుష 52 ; కుల్దీ ప్ యాదవ్ 2/76, జడేజా 2/64, మానవ్ సుతార్ 2/33, బ్రార్ 1/49)

భారత్ ఇన్నింగ్స్ : 357/6 ( పడిక్కల్ 142 బ్యాటింగ్, జడేజా 63, రాహుల్ 40, మానవ్ సుతార్ 41, బ్రార్ 36 బ్యాటింగ్, మెండిస్ 2/77, అసంక మనోజ్ 2/32)