24-02-2026 12:25:24 AM
దర్శకుడు మణిరత్నం 2025లో ‘థగ్‌లైఫ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. కమల్‌హాసన్ కథానాయకుడిగా నటించిన ఆ సినిమా మణిరత్నానికి నిరాశే మిగిల్చింది. అయితే, ఆయన ఇప్పుడు ఓ రొమాంటిక్ డ్రామాను తెరకెక్కించబోతున్నారు. ఆయన ఈ సినిమాను తొలుత శింబుతో కానీ, ధ్రువ్ విక్రమ్‌తో కానీ చేస్తాడని ఇప్పటివరకు ప్రచారం జరిగింది. కానీ, అనూహ్యంగా ఈ ప్రాజెక్టులోకి కోలీవుడ్ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి వచ్చారు.
ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర కథనాలు ప్రస్తుతం తమిళ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజా సమాచారం ప్రకారం.. ఇప్పటికే ఏఆర్ రెహమాన్ టీమ్ కొన్ని ట్రాక్స్ కూడా కంపోజ్ చేసింది. విజయ్ సేతుపతి ప్రస్తుతం చేస్తున్న సినిమాలు పూర్తి కాగానే, మణిరత్నం ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా రాబోతుందని భోగట్టా.
ఈ సినిమాలో విజయ్ సేతుపతి సరసన సాయిపల్లవి కథానాయికగా నటించను న్నట్టు సమాచారం. విజయ్ సేతుపతి ప్రస్తుతం ‘జైలర్2’ వంటి పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇక సాయిపల్లవి ప్రస్తుతం బాలీవుడ్‌లో ఫుల్ బిజీగా ఉంద. ఆమె చేతిలో ఇప్పుడు ‘ఏక్ దిన్’, ‘రామాయణ’ పార్ట్ 1, పార్ట్ 2 సినిమాలు ఉన్నాయి. అంతేకాక ఇటీవలే ధనుష్ హీరోగా నటిస్తున్న ‘డీ55’ (వర్కింగ్ టైటిల్)లోనూ భాగమైన సంగతి తెలిసిందే.