విశాఖలో ఫరెవర్ న్యూ మొదటి స్టోర్ ప్రారంభం
మే 1, విశాఖ: విశాఖపట్నం ఒక సరికొత్త వాణిజ్య విభాగంలోకి అడుగుపెడుతోంది. నగరంలోని ఇనార్బిట్ మాల్ లో ఫరెవర్ న్యూ మొట్టమొదటి స్టోర్ ఏర్పాటు చేయబడింది. ఇటీవల ప్రారంభమైన స్టోర్ ద్వారా ఈ బ్రాండ్ ఆంధ్రప్రదేశ్‌లోకి అధికారికంగా ప్రవేశించింది. తద్వారా, నిరంతరం మారుతున్న, డిజైన్-ఆధారిత అభిరుచులచే ప్రభావితమైన మార్కెట్‌కు, తనదైన ప్రత్యేక శైలి సున్నితమైన, సందర్భోచిత దుస్తులు, ఆధునిక స్త్రీత్వపు ప్రపంచాన్ని తీసుకువస్తోంది.
ఈ స్టోర్ ఆధునిక, స్ట్రీమ్‌లైన్డ్ లేఅవుట్‌తో రూపొందించబడింది, ఇది వినియోగదారులకు పూర్తి స్పష్టత, సౌలభ్యాన్ని అందించే రీతిలో ఉంటుంది . దీనిలో, ఆధునిక, విభిన్న మైన ఫ్యాషన్ అభిరుచులు కలిగిన వినియోగదారుల కోసం ఎటువంటి ఆర్భాటం లేకుండా, ఏ సందర్భానికైనా చక్కగా సరిపోయే రీతిలో ఆకర్షనీయమైన వస్త్రాలు అందుబాటులో ఉంచారు. ఈ కొత్త స్టోర్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని న్యూ వేవ్ పేరిట ఒక కలెక్షన్ తీసుకు వచ్చారు.
సౌకర్య వంతమైన సిల్హౌట్‌లు, మెరుగైన వేసవి డ్రెస్సింగ్ వేడుకలా ఈ కలెక్షన్ ఉంటుంది. అద్వితీయ క్షణాల ద్వారా సౌకర్యవంతంగా కదిలే ఆధునిక మహిళ కోసం రూపొందించబడిన ప్రత్యేక కలెక్షన్ ఇది. ఫ్లూయిడ్ షేప్స్ , మృదువైన కుట్టుపని మరియు సొగసైనవిగా ఉండటంతో పాటు సులభంగా అనిపించే ఉన్నతమైన డీటెయిల్స్ ను ఒకచోట అందిస్తున్నారు.
మండుటెండలలో ఆహ్లాదకరమైన అనుభవాలను అందించే బీచ్ హాలీడే ల నుండి తీరికైన బ్రంచ్‌లు మరియు సన్నిహిత అనుభూతులను అందించే సాయంత్రం సోయిరీల వరకు, ఈ కలెక్షన్ వైవిధ్యమైన వార్డ్‌రోబ్‌ను అందిస్తుంది. ఈ ప్రారంభోత్సవంపై ఫరెవర్ న్యూ కంట్రీ డైరెక్టర్ - ఇండియా షిఫాలీ సింగ్ మాట్లాడుతూ నగరంలో తమ మొదటి స్టోర్‌తో విశాఖపట్నంకు ఫరెవర్ న్యూను పరిచయం చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ ప్రారంభంతో తమ డిజైన్ ఫిలాసఫీని, కస్టమర్ అనుభవాన్ని నూతన తరపు వినియోగదారులకు చేరువ చేయడానికి ఉపయోగపడుతుందన్నారు. దేశవ్యాప్తంగా తమ బ్రాండ్ ను విస్తరింపజేస్తున్నట్టు తెలిపారు.






