ప్రజావాణికి భూకబ్జాల భాగోతం
- కలెక్టర్ ఫిర్యాదు చేసిన విప్లవ కార్మిక సంఘాలు
- విచారణ కోసం ఆదేశాలు
బెల్లంపల్లి,(విజయ క్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కన్నాల శివారు భూకబ్జాల దందా మరోసారి అధికారుల దృష్టికి వెళ్లింది. వందల ఎకరాల ప్రభుత్వం భూసంపద అక్రమార్కుల పాలవుతున్నది. ఈవిషయమై విప్లవ కార్మిక సంఘాల ప్రజా ఫిర్యాదు చేశారు..దీంతో మరోసారి కన్నాల శివారు కేంద్రంగా యదేచ్ఛగా సాగుతోన్న భూకబ్జాలు చర్చనీయాంశమయ్యాయి.
కబ్జాలకు గురవుతున్న కన్నాల శివారు సర్వే నంబర్ 60, 112, భూములను భూమాఫియా, కబ్జా కోరల నుంచి స్వాధీనం చేసుకోవాలని కోరారు. ఇంటి స్థలాలు లేని పేదలకు ఇందిరమ్మ ఇండ్లకు కేటాయించి పేదలకు న్యాయం చేయాలని కోరారు. కన్నాల గ్రామపంచాయతీ శివారులో సర్వే నంబర్ 60,112,142,143,114. లలో వందల ఎకరాల ప్రభుత్వ భూములు కలవు. ఇట్టి భూములను రియల్ ఎస్టేట్, భూమాఫియా, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆయా పార్టీల లో చేరి, కబ్జాలు చేసే దళారీలు, బడా వ్యాపారస్తులకు, డబుల్ రూములు ఇండ్లు నిర్మించిన కాంట్రాక్టర్ , కన్నాల తాజా మాజీ సర్పంచ్ కుటుంబం సహా కబ్జాలు చేసి విక్రయింస్తున్నారని ఆరోపించారు.
సింగిల్ రూమ్ లు నిర్మించి గ్రామపంచాయతీ నుండి పాత గతించిపోయిన సంవత్సరాలు, తేదీలలో ఇంటి పన్నులు కట్టినట్టు రసీదులు సృష్టించి కబ్జా భూములను విక్రయిస్తున్నారుని తెలిపారు. రెవెన్యూ అధికారులు ఎకరాల కొద్ది లావని పట్టాలు చేయటం, పరిపాటిగా మారిపోయిందినీ తెలిపారు. ఈ ప్రాంతంలో కొద్ది మొత్తంలో పట్ట భూమి కొనుగోలు చేసి దానిని ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూములను కూడా తమ వెంచర్లలో కలుపుకొని ప్లాట్లు చేసి విక్రయిస్తున్నారునీ ఫిర్యాదు లో పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో ఉన్న ఎర్రకుంట చెరువును సైతం కబ్జా చేశారనీ తెలిపారు.
దీనిని పునరుద్ధరించి కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాలు కలెక్టర్ కు ఫిర్యాదు చేశాయి. క్షేత్రస్థాయిలో పర్యటించి విచారణ కూడా జరిపి ఇరిగేషన్ అధికారులకు సూచనలు కూడా చేశారు. సర్వేలు కూడా జరిపించారు. కానీ పాత మ్యాపుల్లో ఉన్న చెరువు భూమి రియల్ ఎస్టేట్ వారికి అనుకూలంగా కుదిరించబడిందినీ పేర్కొన్నారు. చెరువు మత్తడి, కట్ట, నిర్మిస్తామని, తాత్కాలికంగా ఇసుక బస్తాలతో గండి పూర్తి చేస్తామన్న ఇరిగేషన్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారనీ తెలిపారు.
ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వెంచర్లు వేస్తున్న వారికి నాలా, డి. సి. సి. పి. అనుమతులు లేవనీ, ప్రభుత్వ భూముల్లో నిర్మిస్తున్న వాటిని గ్రామపంచాయతీ వారు ఇంటి నెంబర్లు అనుమతులు ఇస్తూ రియల్ ఎస్టేట్ భూమాఫియాతో కుమ్మక్కై ప్రభుత్వ భూములు కబ్జా చేసే వారికి తోడ్పడుతున్నారనీ తెలిపారు. గుట్టలకు గుట్టలు తొలిచి ఎర్రగుంట చెరువులో నింపి ఆ నేమెళ్ళ గుట్టును కూడా అక్రమించారనీ, దీనిపై ఎటువంటి చర్యలు లేవనీ వాపోయారు. కబ్జాకోరుల వెనుక బలమైన రాజకీయ నాయకుల అండదండలలున్నాయి. అధికారుల పై ఒత్తిడి తీసుకురావడమే చర్యలకు నోచుకోవడంలేదని తెలిపారు.
ఇప్పటికైనా అన్ని విషయాల పట్ల కులక షంగా పరిశీలించి, విచారణ జరిపించి తగు చర్యలు తీసుకోవలసిందిగా కోరారు. ప్రభుత్వ భూములను కాపాడాలని కబ్జాదారుల పట్ల కఠినంగా వ్యవహరించాలని విప్లవ కార్మిక సంఘాల జేఏసీ విన్నవించింది. నెమిళ్ల గుట్టను తొలిచిన వెంచర్స్ పై చర్యలు తీసుకోవాలని ప్రజావాణికి విప్లవ కార్మిక సంఘాల జేఏసీ ప్రతినిధులు అంబాల మహేందర్ (సింగరేణి గణి కార్మిక సంఘం(SGKS),M. పోశ మల్లు,( శ్రామిక శక్తి గోదావరి లోయ బొగ్గు గని కార్మిక సంఘం (AIFTU), గోగర్ల శంకర్ (TUCI) ఫిర్యాదు చేశారు.






