calender_icon.png 21 February, 2026 | 11:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కరీంనగర్‌లో కాషాయపు

21-02-2026 09:03:53 PM

విజయంతో  కాంగ్రెస్ కు   కౌంట్ డౌన్  స్టార్ట్

రాష్ట్రంలో కాంగ్రెస్ పని అయిపోయింది

భవిష్యత్తు అంతా బిజెపి దే

బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు శాంతి కుమార్

ముకరంపుర,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం ప్రప్రదంగా కరీంనగర్ గడ్డపై తొలిసారిగా మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోవడం శుభ పరిణామమని ,  కరీంనగర్ గడ్డ నుండే రాష్ట్ర చరిత్రను మార్పు చేసే అనేక ఘటనలు జరిగాయని, కరీంనగర్ సెంటిమెంట్ ను ఎంతోమంది బలంగా విశ్వసిస్తారని, సెంటిమెంట్ గుబులు అన్ని పార్టీలకు మొదలైందని, చరిత్ర తిరగరాసే విధంగా బల్దియా పై కాషాయ జెండా ఎగరవేసిన బీజేపీ కి ఇక  తిరుగు లేదని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు శాంతి కుమార్ అన్నారు.

  శనివారం రోజున కరీంనగర్లోని సాయి మహాలక్ష్మి గార్డెన్స్ లో పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ   ప్రశిక్షణ మహా అభియాన్ 2026  కరీంనగర్ జిల్లా కార్యశాల ప్రోగ్రాం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ పాలన పట్ల తీవ్ర  ప్రజా వ్యతిరేకత  మొదలైందని,  రాష్ట్రంలో కాంగ్రెస్ పని అయిపోయిందని, భవిష్యత్తు అంతా బిజెపి దేనన్నారు.. ఉచితాలు,  హామీలు, ఆరు  గ్యారెంటీల పేరిట కాంగ్రెస్ గారడి చేసి ప్రజలను తీవ్రంగా మోసం చేసిందన్నారు. రెండున్నర ఏళ్లలో కాంగ్రెస్ పూర్తిగా ప్రజా విశ్వాసాన్ని కోల్పోయిందన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమాన్ని మరిచి  సీఎం కూర్చిని కాపాడుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నారు. వచ్చేనెల జరగబోయే ప్రశిక్షణ మహా అభియాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. వ్యక్తి నిర్మాణం ద్వారా సంస్థ నిర్మాణం, సంస్థ నిర్మాణం ద్వారా దేశ నిర్మాణం అని చాటి చెప్పిన పార్టీ సిద్ధాంతకర్త పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ చూపెట్టిన మార్గంలో పార్టీ శ్రేణులు అందరూ నడవాలన్నారు.

శిక్షణలో అనేక విషయాలను తెలుసుకునే అవకాశం ఉంటుందని, ప్రతి ఒక్కరూ ఈ శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి   ప్రశిక్షణ ప్రోగ్రాం కు సంబంధించి పార్టీ శ్రేణులకు మార్గదర్శనం చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇనుకొండ నాగేశ్వర్ రెడ్డి, రాష్ట్ర మహిళా నాయకురాలు నిర్మలారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు మాడ వెంకటరెడ్డి, బత్తుల లక్ష్మీనారాయణ, పార్లమెంటు కన్వీనర్, కార్పొరేటర్ బోయిన్పల్లి ప్రవీణ్ రావ్, ఉపాధ్యక్షులు సాయిని మల్లేశం, సీనియర్ నాయకులు గుజ్జ శ్రీనివాస్ లతో పాటు వివిధ  నాయకులు, కార్యకర్తలు  పాల్గొన్నారు