విద్యుత్ వినియోగంలో భద్రత నియమాలు పాటించాలి
25-07-2026 12:00 AM
భూపాలపల్లి టౌన్, (విజయక్రాంతి): ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని విద్యుత్తు శాఖ ఎస్ ఈ రమేష్ తెలిపారు. శుక్రవారం భూపాలపల్లి సర్కిల్ పరిధిలోని రేగొండ సెక్షన్లోని నిజాంపల్లి గ్రామంలో విద్యుత్ భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్ ఈ రమేష్ గ్రామస్థులకు విద్యుత్ లైన్లకు సమీపంలో అప్రమత్తంగా ఉండాలని, అనధికారిక కనెక్షన్లు తీసుకోవద్దని, ఎలాంటి లోపాలు గమనించిన వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రజలు విద్యుత్తు సమస్యలను ఎస్‌ఈ దృష్టికి తీసుకురాగా సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ సిబ్బంది, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.






