బ్లాక్ స్పాట్స్‌లో భద్రతా చర్యలు: ఎస్పీ నితిక
26-02-2026 12:00 AM
వాంకిడి, ఫిబ్రవరి24 (విజయక్రాంతి): వాంకిడి మండల పరిధిలోని ఇందాని, గణేశ్పూర్, సోనాపూర్, వాంకిడి, కమాన ఎక్స్రోడ్ ప్రాంతాల్లో గుర్తించిన రోడ్డు ప్రమాదాల బ్లాక్ స్పాట్స్‌ను ఎస్పీ నితిక పంత్ పరిశీలించారు. ఈ సందర్భంగా జాతీయ రహదారుల సంస్థ అధికారులు, పోలీస్ అధికారులకు రోడ్డు ప్రమాదాల నివారణకు మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు.
ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాల్లో ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించడం కీలకమని, పోలీస్ శాఖతో పాటు సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రమాదాలను తగ్గించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ చిత్తరంజన్, సీఐ సత్యనారాయణ, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ శ్రీధర్, ఎస్‌ఐ మహేందర్ పాల్గొన్నారు.




