26 February, 2026 | 9:49 PM

హయత్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సర్టిఫికెట్ కోర్సులు ప్రారంభం

26-02-2026 12:00 AM

ఎల్బీనగర్, ఫిబ్రవరి 25 : హయత్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాజనీతి శాస్త్రం, ఆర్థిక శాస్త్రంలో నూతనంగా రెండు సర్టిఫికెట్ కోర్సులు ప్రారంభించారు. రాజనీతి శాస్త్ర విభాగంలో ‘భారత రాజ్యాంగ ప్రవేశికను అర్థం చేసుకోవడం’ అనే అంశంపై, అర్థశాస్త్రం ’సేంద్రీయ వ్యవసాయం’ అనే అంశం పై సర్టిఫికెట్ కోర్సులను కళాశాల ఇన్ చార్జి ప్రిన్సి పాల్ ఇందిరా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... రాజ్యాంగాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి’ రాజ్యాంగ ప్రవేశిక ఒక అవగాహన’ అనే అం శం విద్యార్థులకు ఉపయుక్తంగా ఉంటుందన్నారు.

రసాయన ఎరువులతో కొనసాగే నేటి వ్యవసాయాన్ని తగ్గించి, ఆరోగ్యానికి హాని కలి గించని ఆహార పంటలు పండించడానికి ఆర్గానిక్ అగ్రికల్చర్ కోర్సు ఉపయో గపడు తుం దని తెలిపారు. రైతులు జీవ వ్యవసాయంపై దృష్టి పెట్టాలని సూచించారు. ఈ సమావేశంలో అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ నర్సింహ, రాజనీతి శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ శ్రీపతి నాయుడు, రాజనీతి శాస్త్ర అధ్యాపకులు డాక్టర్ యాదగిరి రెడ్డి, డాక్టర్ నాగరాజు, అర్థశాస్త్ర అధ్యాపకులు షేక్ మహబూబ్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అధ్యాపకుడు డాక్టర్ గీతా నాయక్, విద్యార్థులు పాల్గొన్నారు.