calender_icon.png 12 February, 2026 | 12:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్పొరేషన్‌లో ఓటు హక్కును వినియోగించుకున్న సాబీర్ పాషా

11-02-2026 06:36:17 PM

కొత్తగూడెం,(విజయక్రాంతి): కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 26వ డివిజన్ పరిధిలో ఓటు ఉన్న ఆయన సింగరేణి స్కూల్లో తన ఓటును వేశారు. సిపిఐ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ఉదయం నుంచి అన్ని పోలింగ్ బూతుల సమీపంలో పార్టీ శ్రేణులకు ధైర్యాన్ని నింపుతూ ముందుకు సాగారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేషన్ వ్యాప్తంగా 36కు పైగా స్థానాల్లో సిపిఐ విజయం సాధిస్తుందని ఆశాషాభావాన్ని వ్యక్తం చేశారు. రామవరం ఏరియాలోని పోలింగ్ బూతతుల వద్ద పోలీసులు అతి ఉత్సాహాన్ని ప్రదర్శిస్తుండడంతో ఆయన అసహనాన్ని వ్యక్తం చేశారు. అంతేగాక ఒకానొకు దశలో సిపిఐ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య పెద్ద ఎత్తున వాగ్వాదం చోటు చేసుకోవడంతో అది తీవ్ర రూపం దాల్చకుండా అయన తనదైన శైలిలో వ్యవహరించారు.