21 March, 2026 | 1:38 AM

రూపాయి కుదేలు

21-03-2026 12:00 AM

93.70 స్థాయికి పతనం

ఏడాదిలో 11శాతం క్షీణత

న్యూఢిల్లీ, మార్చి 20 : భారత ఆర్థిక వ్యవస్థకు ప్రస్తుతం గడ్డుకాలం ఎదురవుతోంది. ఒకవైపు ఇరాన్ యుద్ధం నడుస్తుండడం, మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో రికార్డుస్థాయికి చేరుతున్న క్రూడ్ ఆయిల్ ధరలు దేశీయ కరెన్సీని అత్యంత కనిష్ఠానికి నెట్టేస్తున్నాయి. శుక్రవారం రూపాయి విలువ భారీ గా పతనమైంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ మొదటి సారి 93 మార్కు ను దాటి 93.70 స్థాయికి పడిపోయింది. దీంతో ఇన్వెస్టర్లలో తీవ్ర ఆందోళన నెలకొన్నది.

పశ్చిమాసియాలో యుద్ధం మొదలైన ప్పటి  నుంచి రూపాయి సుమారు 2శాతం మేర పతనమైంది. డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ ఏడాది కాలంలోనే 11 శా తం మేర క్షీణించి రికార్డు పతనాన్ని నమోదు చేసింది. గత ఏడాది మే 2వ తేదీన డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ 83.76 వద్ద ఉండగా, ప్రస్తుతం అది 93.70 స్థాయికి చేరుకుంది. అంటే కేవలం ఏడాది కాలంలోనే రూపాయి విలువ సుమారు 11 శాతం పడిపోయింది.

ముడి చమురు ధరలు బ్యారె ల్ 100 డాలర్ల వద్దే కొనసాగితే, రూపాయి మరింత క్షీణించి 95 స్థాయికి చేరుకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. రూపాయి బలహీనపడటం వల్ల దిగుమతి చేసుకునే వ స్తువుల ధరలు గణనీయంగా పెరుగుతాయి.  భారతదేశం తన చమురు అవసరాల్లో ఎక్కు వ భాగం దిగుమతులపైనే ఆధారపడుతుంది.

రూపాయి పతనంతో చమురు దిగుమతి భారం పెరిగి, రవాణా ఖర్చులు, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. తయారీ రంగంలో వాడే ముడి పదార్థాల ధరలు కూడా పెరుగుతాయని, దీనివల్ల సామాన్య కుటుంబాల నెలవారీ బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం పడుతుందని అంటున్నారు. ఇది ద్రవ్యోల్బణాన్ని మరింత పెంచి, ఆర్బీఐకి పెద్ద సవాలుగా మారనుంది.