10 March, 2026 | 2:09 AM

ప్రజా పాలన ప్రణాళిక విజయవంతం చేసేందుకే 5కే రన్

10-03-2026 12:44 AM

మంథని మున్సిపల్ చైర్మన్ ఓడ్నాల శ్రీనివాస్

మంథని మార్చి09 (విజయక్రాంతి): ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతం చేసేందుకే 5కే రన్ నిర్వహిస్తున్నట్లు మంథని మున్సిపల్ చైర్మన్ ఓడ్నాల శ్రీనివాస్ తెలిపారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్య క్రమములో భాగంగా సోమవారం మున్సిపల్ చైర్మన్ ఒడ్నాల శ్రీనివాస్ ఆధ్వర్యము లో వైస్ చైర్మన్ ముస్కుల సహేందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ మనోహర్, కౌన్సిలర్స్ తో పాటు అధికారులు మంథని పట్టణ ప్రజలతో పాత పెట్రోల్ బంక్ నుంచి బస్ డిపో వరకు 5K రన్ నిర్వహించారు.

అనంతరం 2వ వార్డు లోని ఎరుకల గూడెంలో పారిశు ద్ధ్య కార్యక్రమం నిర్వహించి, మురుగు కాలువలు శుభ్రం చేయించి, ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు.ఈ కార్యక్రమములో వార్డు కౌన్సిలర్స్ కుర్ర లింగయ్య, నూకల కమల్, ఎరుకల స్రవంతి, జంబోజు శ్రీమతి, మారుపాక నిహారిక, పెంటరి రాజు, ఎల్లెంకి వంశీ ధర్, మెప్మా సీఈఓ లావణ్య, మెప్మా ఆర్.పి లు మున్సిపల్ సిబ్బంది,  పాల్గొన్నారు.