ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
- ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
చొప్పదండి, మార్చి 9 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలోని ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం పని చేస్తుందని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు. గంగాధర మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 90 మంది లబ్ధిదారులకు కల్యా ణ లక్ష్మి క్రింద 90,10,440, ముఖ్యమంత్రి సహాయ నిధి క్రింద 40 మంది లబ్ధిదారులకు 10, 86,000 రూపాయల ఆర్థిక సహాయం మంజూరు సోమవారం గంగాధర మండల పరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద, మధ్య తరగతి ఆడబిడ్డల పెళ్ళికి కళ్యాణ లక్ష్మి భరోసా కల్పిస్తోందని పేర్కొన్నారు. అలాగే అనారోగ్యంతో, ప్రమాదాల్లో గాయపడి ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న పేద, మధ్యతరగతి ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఆపదలో అండగా నిలుస్తుంది అన్నారు. చొప్పదండి నియోజకవర్గం ప్రజలకు అన్ని విధాలుగా ఆదుకొని అండగా ఉంటామని పేర్కొన్నారు.
కల్యాణ లక్ష్మి, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ అంబటి రజిత ఎండిఓ దామ్ రాము, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పురుమల్ల మనోహర్, సర్పంచ్లు సంఘం మండల అధ్యక్షుడు ముద్దం నగేష్, మాజీ సింగిల్ విండో చైర్మన్ వెలిచాల తిర్మల్ రావు, రామిడి రాజిరెడ్డి, గును కొండ బాబు, బారాజు ప్రభాకర్ రెడ్డి, పడాల భాగ్యలక్ష్మి రాజన్న, వేముల భాస్కర్, కడారి హారిక కనకయ్య, తదితరులు పాల్గొన్నారు.




