2 August, 2026 | 1:25 AM

స్వేచ్ఛ అంటే ఇష్టారాజ్యం కాదు!

02-08-2026 12:53 AM
  1. ఎవరైనా ఏదైనా చేయవచ్చనే ఆలోచన తప్పు
  2. నేటి యువత ప్రజాస్వామిక విలువలు పాటించాలి
  3. దేశం పట్ల బాధ్యతగా మెలగాలి.. దేశాభివృద్ధిలో వారి పాత్రే కీలకం
  4. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్
  5. ‘లోకమాన్య తిలక్’ అవార్డు స్వీకరణ కార్యక్రమంలో వ్యాఖ్యలు

ముంబై, ఆగస్టు ౧ : ‘స్వేచ్ఛ అంటే ఇష్టారాజ్యం కాదు. యువత స్వేచ్ఛా స్వాతంత్య్రా లు అనుభవించడమే కాదు.. సమాజం పట్ల బాధ్యతగా మెలగాలి. దేశం పట్ల ప్రేమ కలిగి ఉండాలి. స్వేచ్ఛ అంటే ఎవరు.. ఏదైనా చే యవచ్చని నేటి యువత భావిస్తుండవచ్చు. ఆ ఆలోచన తప్పు. నిజమైన స్వేచ్ఛ అంటే అది కాదు.

ప్రజాస్వామ్య విలువలు పాటి స్తూ, బాధ్యతగా మెలగడమే నిజమైన స్వేచ్ఛ’ అని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అభిప్రాయపడ్డారు. బాలగంగాధర్ తిలక్ వర్ధంతిని పురస్కరించుకుని మహారాష్ట్రలోని పుణెలో శనివారం ఆయన ‘లోకమా న్య తిలక్’ జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా పుర స్కార ప్రదానం చేశారు.

జాతీయ భద్రత, విదేశాంగ విధానం, రక్షణశాఖ పటిష్టత విషయంలో దశాబ్దాల నుంచి అందిస్తున్న సే వలకు గాను ‘లోకమాన్య తిలక్ ట్రస్ట్’ ఈ ఏడాది దోవల్‌ను పురస్కారానికి ఎంపిక చే సింది. పురస్కార ప్రదాతలు ముందుగా దో వల్‌కు సంప్రదాయ పూణేరి తలపాగాను అలకరించారు. జ్ఞాపిక అందజేశారు.

అనంతరం దోవల్ ఇటీవల ఢిల్లీలో జరిగిన జెన్‌జీ విద్యార్థి ఉద్యమంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగత ప్రయోజనాల కంటే దేశ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇవ్వాలని, దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. లోకమాన్య తిలక్ ఆశ యాలు, జాతీయోద్యమ స్పూర్తిని నేటి తరం పుణికిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. బ్రి టిష్ నిరంకుశ పాలన, అణచివేతల మధ్య తిలక్ రాజీలేని పోరాటం చేశారని కొనియాడారు. తిలక్ పేరిట అందిస్తున్న అవార్డును తాను అందుకోవడం పూర్వజన్మ సుకృతమ ని వర్ణించారు.

మోదీ, అమిత్ షాది బలమైన నాయకత్వం

ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా నాయకత్వంపై అజిత్ దోవల్ ప్రశంసల వర్షం కురిపించారు. వారిద్దరి నాయకత్వం ఎంతో బలమైనదని అభివర్ణించారు. అలాం టి నాయకత్వం భారతదేశానికి ఉండటం అదృష్టమని కొనియాడారు. దేశం ప్రస్తుతం అంతర్గత, బాహ్య సవాళ్లను ఎదుర్కొంటున్నదని, అయినప్పటికీ అన్ని రంగాల్లో పురోభి వృద్ధి సాధిస్తున్నదని వెల్లడించారు. ఇలాంటి సమయంలో ప్రతి పౌరుడు జాతీయ ప్ర యోజనాల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రసంగిస్తూ.. దేశానికి అజిత్ దోవల్ దశాబ్దాల నుంచి విశిష్ట సేవలు అందిస్తున్నారని కొనియాడారు. ప్రధాని మోదీ తీసుకునే ప్రతి కీలక నిర్ణయం వెనుక దోవల్ సలహాలు, సూచనలు ఉన్నాయని ఉద్ఘాటించారు. కార్యక్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేం ద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రులు ఏక్నాథ్ షిండే, సునేత్రా పవార్ పాల్గొన్నారు.