అటానమస్‌కే జై!
- డిగ్రీలో మారుతున్న విద్యార్థుల ఆలోచన
- స్వయంప్రతిపత్తి కాలేజీల వైపు మొగ్గు
- కొత్త కోర్సులు, వినూత్న బోధన విధానాలు
- మెరుగైన ప్లేస్‌మెంట్లు, ఉద్యోగ భరోసా
- ‘అటానమస్’లో భారీగా పెరిగిన అడ్మిషన్లు
- సాధారణ కాలేజీలకు గుడ్ బై
హైదరాబాద్, ఆగస్టు 1(విజయక్రాంతి): డిగ్రీలో చేరే విద్యార్థుల ఆలోచన విధానం మారుతోంది. ఏదో ఒక కాలేజీలో చేరకుండా, భవిష్యత్తు భరోసానిచ్చే కళాశాలల వైపు మొగ్గు చూపుతున్నారు. సాధారణ డిగ్రీ కాలేజీల్లో కాకుండా స్వయంప్రతిపత్తి (అటానమస్) కాలేజీల్లో సీట్ల కోసం పోటీ పడుతున్నారు.

కొత్త కోర్సులు, బోధ న విధానాల్లో మార్పులు, ఆశాజనకమైన ప్లేస్‌మెంట్లు విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. ఈ కాలేజీల్లో చదివితే మంచి ఫలితాలు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయన్న నమ్మకంతో అటానమస్ కాలేజీలను ఎం చుకుంటున్నారు. ఫలితంగా వీటికి డిమాండ్ పెరిగింది.
‘అటానమస్’తో మారుతున్న రూపురేఖలు
స్వయం ప్రతిపత్తి హోదా వచ్చిన కాలేజీల ముఖచిత్రమే మారిపోయింది. యూనివర్సిటీ సిలబస్ కాకుం డా తమకు తామే సిలబస్ రూపకల్పన, పరీక్షల నిర్వహణ, ఫలితాలు వెల్లడించే వెసులుబాటు ఉంది. అంతే కాకుండా ఈ కాలేజీల్లో పీహెచ్‌డీ చేసిన ప్రొఫెసర్లు ఉంటున్నారు. బోధనతో పాటు పరిశోధనకు ప్రాధా న్యం ఇస్తున్నారు.
సకల మౌలిక వసతులు -ఆధునిక ల్యా బ్‌లు, డిజిటల్ క్ల్లాస్‌రూమ్‌లు, సెమినార్ హాళ్లు, పెద్ద లైబ్రరీలు అందుబాటులో ఉన్నాయి. దీంతో ఫలితాలు గణనీయంగా పెరుగుతున్నాయి. విద్యార్థుల ఆలోన విధానం కూడా మారింది. నాలుగు గోడల మధ్య కా కుండా, బయట ప్రపంచానికి పనికొచ్చే డిగ్రీలు కావాలి అనేది వారి ఆలోచన. అందుకే అటానమస్ కాలేజీల వైపు మొగ్గు చూపుతున్నారు. ఆయా కాలేజీల్లో చేరితే డిగ్రీ పట్టా చేతికి రాకముందే జాబ్ ఆఫర్లు వస్తాయని పలువురు అటానమస్ విద్యార్థులు అంటున్నారు.
47,441 అడ్మిషన్లు
డిగ్రీ విద్యలో అటానమస్ కాలేజీలకే విద్యార్థులు జై కొడుతున్నారు. దోస్త్ అడ్మిషన్ల ప్రక్రియ దాదాపు ముగిసిపోయినట్లే. స్పెషల్ ఫేజ్ వరకు మొత్తం 1,69,400 మంది విద్యార్థులు సీట్లు దక్కించుకున్నారు. వీరిలో 47,441 మంది అటానమస్ కాలేజీల్లోనే సీట్లు పొందా రు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, ప్రైవేట్ కాలేజీలతో పోల్చి నా అటానమస్ కాలేజీలకే అధిక డిమాండ్ ఉంటున్నది. ప్రైవేట్, ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లోనూ పరిస్థితి ఏ మాత్రం ఆశాజనకంగా లేదు.
అటానమస్ కాలేజీల్లోని సీట్లే నిండుతున్నాయి. రాష్ట్రంలోని ప్రముఖ డిగ్రీ కాలేజీల్లో దాదాపు అన్ని అటానమస్‌వే ఉన్నాయి. 2004 నుంచి పలు కాలేజీలు అటానమస్ హో దా కలిగి ఉన్నాయి. హైదరాబాద్‌లోని నిజాం కాలేజీ, సిటీ కాలేజీ, బేగంపేట డిగ్రీ కాలేజీ, ఎస్సార్‌ఆర్(కరీంనగర్), ఎఎస్‌ఆర్‌బీజీఎన్‌ఆర్(ఖమ్మం), ఎన్జీ కాలేజీ (నల్లగొండ), పింగలి కాలేజీ (వరంగల్), గిరిరాజ్(ఖమ్మం) వంటివి ఈ జాబితాలో ఉన్నాయి.
ప్రముఖ కాలేజీలు కావడం, రెండు దశాబ్దాలుగా అటానమస్‌హోదా కలిగి ఉండటంతో ఇవి అద్భుత ఫలితాలు సాధిస్తున్నాయి. ఈ కాలేజీల్లో పీహెచ్‌డీ ప్రొఫెసర్లు, అన్ని రకాల వసతులుండటమే కాకుండా, వినూత్నమైన కొత్త కోర్సులను కాలేజీలు ప్ర వేశపెడుతున్నాయి.
కొన్ని కాలేజీల్లోనైతే సర్టిఫికెట్ కో ర్సులను తీసుకొచ్చాయి. ఎమర్జింగ్ టెక్నాలజీ, లైఫ్ స్కిల్స్, ఎమర్జింగ్టెక్నాలజీ, లైఫ్స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ కోర్సులను అందిస్తున్నాయి. వీటికి తోడూ మంచి ప్లేస్‌మెంట్స్ కూడా ఉంటున్నాయి. మార్కెట్‌కు అవసరమైన వినూత్నమైన కొత్త కోర్సులను ఆఫర్ చేస్తుండటంతో విద్యార్థులు అటానమస్ కాలేజీల బాట పడుతున్నారు.






