మహిళల చైతన్యంతోనే గ్రామాల అభివృద్ధి
- అబ్దుల్లాపూర్ మెట్ ఎంపీడీఓ శ్రీవాణి
- బండరావిరాలలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం
అబ్దుల్లాపూర్ మెట్, మార్చి 9: మహిళల చైతన్యంతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ) శ్రీవాణి అన్నారు. మండలంలోని బండరావిరాల గ్రామ సర్పంచ్ కందికంటి విజయ్ కుమార్, పాలకవర్గం ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఆమె ముఖ్యఅతిధిగా హాజరై ఇన్ స్పెక్టర్ ప్రియాంకరెడ్డి, మండల వైద్యాధికారి ప్రియాంక, ఐసీడీఎస్ సూపర్వైజర్ వనజతో కలిసి సావిత్రిబాయి పూలె, చాకలి ఐలమ్మ చిత్రపటాలకు పూలమాలవేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. సమాజంలో మహిళల పాత్ర ఎంతో కీలకమన్నారు. మహిళా సాధికారత ఉన్న చోట సమాజం వేగంగా అభివృద్ధికి ఒక పురుషుడు చదువుకుంటే ఆ వ్యక్తికి మాత్రమే పరిమితం కావచ్చు కాని ఒక మహిళా చదువుకుంటే ఒక కుటుంబమే విద్యావంతులవుతుందాన్నారు. ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మహిళలను గౌరవించడం సంతోషకరమన్నారు.
అనంతరం సమాజ సేవ, విద్యారంగంలో తోడ్పడుతున్న పలువురు మహిళలను శాలువాలతో సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. గచిన రెండు నెలల పాలనలో సర్పంచ్ చేస్తున్న సేవలను అభినందించారు. సుశీల, జడ్పీహెచ్‌ఎస్ వైస్ ప్రిన్సిపల్ రమాదేవి, సబ్ సెంటర్ ఇంచార్జి డాక్టర్ శ్రేయ, ఉపసర్పంచ్ దూస శంకర్, వార్డుసభ్యులు కన్నె భరత్, మేడిపల్లి సుష్మిత రమేష్, ఏర్పుల హరికృష్ణ, కందికంటి అనూష ప్రవీణ్, భవాసశివ ముదిరాజ్, కొత్త అరుణ్ కుమార్ గౌడ్, కోదాసు మణెమ్మ, కందికంటి నర్సింగరావు, నెమురగోముల మహేష్, మహిళా సంఘాల నాయకురాళ్ళు, ఆశావర్కర్లు, గుండోజు రంగదాసు ట్యూషన్ టీచ్చర్లు, అంగన్వాడీ టీచర్లు తదితరులు ఉన్నారు.




