23 April, 2026 | 4:42 PM

పోలీసుల ఆంక్షల మధ్య రెండో రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె

23-04-2026 03:18 PM

ప్రయాణికులకు తప్పని తిప్పలు. 

ప్రజాస్వామ్యబద్ధంగా చేస్తున్న సమ్మెను కాలరాస్తున్న ప్రభుత్వం . 

తాండూరు, ఏప్రిల్ 23,(విజయక్రాంతి): ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్లు సమస్యలను పరిష్కరించాలంటూ కోరుతూ చేస్తున్న సమ్మె నేడు రెండవ రోజుకు చేరుకుంది. బస్సులు డిపో దాటి బయటికి రాకపోవడంతో ప్రయాణికులు మహిళలు, వృద్ధులు, చిన్నారు. తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. ఆర్టీసీ అధికారులు 34 ప్రైవేటు అద్దె బస్సులను వివిధ ప్రాంతాలకు ఏర్పాటు చేశామని డిపో మేనేజర్ సురేష్ కుమార్ తెలిపారు.

మరోవైపు ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు కుర్చీలు,టెంట్ ఇతర సామాగ్రి ఇవ్వకూడదని, సమావేశాలు నిర్వహించుకునేందుకు హోటళ్లు, ఫంక్షన్ హాల్ కూడా ఇవ్వద్దని పోలీసులు యజమానులకు ఆంక్షలు విధించారు. నేడు డిపో ముందు బైఠాయించి ధర్నా చేసేందుకు టెంట్ ఏర్పాటు చేసుకునగా పట్టణ పోలీసులు టెంట్ ను తొలగించి యజమాని పై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా కార్మిక సంఘం నాయకులు మాట్లాడుతూ ప్రజాస్వామ్య బద్దంగా మా సమస్యలు,డిమాండ్లు పరిష్కరించుకునేందుకు సమ్మె చేస్తుండగా ప్రభుత్వం పోలీసుల చేత మా జీవితాలతో చెలగాటమాడుతూ సమ్మెను కాలరాసేoదుకు ప్రయత్నించడం సరికాదన్నారు.