24 April, 2026 | 12:48 PM

Breaking News

ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ స్వగ్రామం ముత్తోజిపేట ఉద్రిక్తత   •   BJP కార్యాలయానికి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి.. త్వరలోనే బీజేపీలోకి?   •   అడవికి వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్రగాయాలు   •   కోనరావుపేటలో ఘనంగా పీఎం శ్రీ ఎంపీపీ ఎస్ ప్రైమరీ స్కూల్ 2వ వార్షికోత్సవం – గ్రాడ్యుయేషన్ డే వేడుకలు   •   కమిటీల పేరుతో కాలయాపన: 900 రోజులైనా— హామీల అమలు ఏమైంది?   •   సివిల్ ఇంజినీర్స్ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం   •   రోడ్లపైకి ఆర్టీసీ కార్మికులు..!   •   అక్రమ రేషన్ బియ్యం స్వాధీనం   •   చర్చలు ప్రారంభం.. హామీలు అమలు చేయాలని ఆర్టీసీ జేఏసీ డిమాండ్   •   ఆవేశంలో అఘాయిత్యాలకు పాల్పడవద్దు.. ఆర్టీసీ కార్మికులకు మంత్రి పొన్నం విజ్ఞప్తి   •  

చర్చలు ప్రారంభం.. హామీలు అమలు చేయాలని ఆర్టీసీ జేఏసీ డిమాండ్

24-04-2026 11:15 AM
  1. ప్రభుత్వ వాగ్దానాలు నెరవేర్చాలని కోరుతున్నాం
  2. కార్మికులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు.. జేఏసీ అండగా ఉంటుంది
  3. శంకర్ గౌడ్ మృతి వంటి ఘటనలు మళ్లీ జరగవద్దు... జేఏసీ కీలక నిర్ణయం
  4. ప్రభుత్వ కమిటీపై నమ్మకంతోనే చర్చలకు వెళ్తున్నాం: ఆర్టీసీ జేఏసీ

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) సమ్మె తీవ్రమవుతున్న నేపథ్యంలో, రాజీ కుదిర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం(Telangana Government) కొత్త ప్రయత్నాలను ప్రారంభించింది. ఇందులో భాగంగా, సమ్మె మూడవ రోజైన శుక్రవారంనాడు ఉద్యోగ సంఘాలను చర్చలకు ఆహ్వానించింది. ప్రభుత్వ వాగ్దానాలు నెరవేర్చాలని ఆర్టీసీ జేఏసీ నేతలు(RTC JAC Leaders Talks) ప్రభుత్వాన్ని కోరారు.

ప్రధాన సమస్యలపై చర్చలకు వెళ్తున్నామని సూచించారు. ఆర్టీసీ కార్మికుల 32 డిమాండ్లలో 27 పూర్తిచేసినట్లు చెబుతున్నారని జేఏసీ నేతలు(RTC JAC) పేర్కొన్నారు. ప్రభుత్వ కమిటీపై నమ్మకంతోనే చర్చలకు వెళ్తున్నామన్నారు. కార్మికుల సంక్షేమం దృష్ట్యా వాగ్దానాలు నెరవేర్చాలని కోరుతున్నామని నేతలు స్పష్టం చేశారు. ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి(Narsampet RTC Driver Shankar Goud Dies) వంటి ఘటనలు మళ్లీ జరగవద్దని జేఏసీ నిర్ణయం తీసుకుందని జేఏసీ వెల్లడించింది. సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఐఏఎస్ కమిటీతో చర్చలు ఉంటాయన్నారు. కార్మికులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని, జేఏసీ అండగా ఉంటుందని నేతలు హామీ ఇచ్చారు.