24 April, 2026 | 12:47 PM

Breaking News

ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ స్వగ్రామం ముత్తోజిపేట ఉద్రిక్తత   •   BJP కార్యాలయానికి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి.. త్వరలోనే బీజేపీలోకి?   •   అడవికి వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్రగాయాలు   •   కోనరావుపేటలో ఘనంగా పీఎం శ్రీ ఎంపీపీ ఎస్ ప్రైమరీ స్కూల్ 2వ వార్షికోత్సవం – గ్రాడ్యుయేషన్ డే వేడుకలు   •   కమిటీల పేరుతో కాలయాపన: 900 రోజులైనా— హామీల అమలు ఏమైంది?   •   సివిల్ ఇంజినీర్స్ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం   •   రోడ్లపైకి ఆర్టీసీ కార్మికులు..!   •   అక్రమ రేషన్ బియ్యం స్వాధీనం   •   చర్చలు ప్రారంభం.. హామీలు అమలు చేయాలని ఆర్టీసీ జేఏసీ డిమాండ్   •   ఆవేశంలో అఘాయిత్యాలకు పాల్పడవద్దు.. ఆర్టీసీ కార్మికులకు మంత్రి పొన్నం విజ్ఞప్తి   •  

అక్రమ రేషన్ బియ్యం స్వాధీనం

24-04-2026 11:16 AM

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): నిరుపేదలకు పంపిణీ చేయాల్సిన రేషన్ బియ్యం అక్రమంగా నిల్వచేసినట్లు గుర్తించిన ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన బిజినపల్లి మండలం లట్టుపల్లి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రేషన్ డీలర్ గోవింద్ మూడు నెలలకు ఒకేసారి ఇవ్వాల్సిన కోట బియ్యాన్ని ప్రజలకు లబ్ధిదారులకు పంచకుండా పక్కనే ఉన్న మరొకరి ఇంట్లో 202 బ్యాగులు స్టోర్ చేశారు.

అక్కడి నుండి తరచూ వేరొక ప్రాంతానికి తరలించి సొమ్ము చేసుకునేవాడని నిల్వ చేసి ఉన్న సమాచారాన్ని అందుకున్న ఎన్ఫోర్స్మెంట్ బృందం ఆకస్మిక దాడి చేసి రేషన్ బియ్యంగా గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు ఎంతమంది లబ్ధిదారులకు ఎంత మేర కోట పంపిణీ చేశారు. ఇంకా ఎంతమందికి చేయాల్సి ఉంది ఎంత మేర అక్రమంగా నిల్వ ఉంచారన్న సమాచారాన్ని రికార్డులను తనిఖీ చేసి సేకరించారు. ఎన్ఫోరసెమెంట్ డీటీ హేమ్లా నాయక్ , ఆర్ఐ బాలరాజు, ఎస్సై శ్రీనివాస్ ఉన్నారు.