18 August, 2026 | 1:17 PM

Breaking News

భూములను భూమాఫీయాకు కట్టబట్టే కుట్ర   •   ఎస్సీ, బీసీల భూములను ప్రభుత్వం లాక్కుంటోంది   •   ప్రభుత్వం తప్పు చేసి.. ప్రజలకు ఎందుకు శిక్ష?   •   ఫర్నిచర్ షాప్‌లో అగ్నిప్రమాదం.. కార్మికుడి సజీవదహణం   •   కస్తూర్బా బాలికల ఆశ్రమ పాఠశాలలో ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆకస్మిక తనిఖీ   •   ఖర్గేను అవమానిస్తారా.. బీజేపీ వైఖరిపై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీను బాబు ఫైర్   •   రోడ్డు కోసం పొలం పోతుందని రైతు ఆత్మహత్యాయత్నం   •   గ్రామ గ్రామాన జల సంరక్షణ పనులు చేపట్టండి   •   అక్రమంగా నిల్వ ఉంచిన పిడిఎస్ రైస్ పట్టివేత   •   ప్రజా సమస్యలు పరిష్కరించాలని ఎంఎంసి కమిషనర్‌కు వినతి   •  

రైతులకు ఆర్థిక అక్షరాస్యత అవగాహన సదస్సు

18-08-2026 10:24 AM

మోతె,(విజయక్రాంతి): మోతె మండల పరిధిలోని నామవరంలో గ్రామంలో సోమవారం తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఆధ్వర్యంలో రైతులకు, ఖాతాదారులకు ఆర్థిక అక్షరాస్యత సదస్సు నిర్వహించారు. అవసరాలకు తగ్గట్టుగా డబ్బును ఖర్చు చేసుకుంటూ, ప్రతినెల సేవింగ్ అకౌంట్ లో కొంత డబ్బును దాచుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని గ్రామీణ బ్యాంకు అధికారులు ఖాతాదారులకు రైతులకు సూచించారు. ఆర్థిక అక్షరాస్యతతో డబ్బులు సేవింగ్ చేసుకొని అభివృద్ధి చెందవచ్చునని ప్రతివారు ఆర్థిక అక్షరాస్యత కలిగి ఉండాలని సూచించారు. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి ఖాతాదారుడు ఇన్సూరెన్స్ కలిగి ఉండాలి.

పీఎం జె జె బి వై 346/ ఇన్సూరెన్స్ కలిగి ఉంటే సహజ మరణానికి 2,00,000/-  పీఎం ఎస్బి వై:-20/- ఇన్సూరెన్స్ కలిగి ఉంటే  సంవత్సరానికి ఒక్కసారి కట్టుకుంటే యాక్సిడెంట్లుగా సంభవించిన 2,00,000/- భీమా వర్తిస్తుంది .ఎస్బిఐ జనరల్ ఇన్సూరెన్స్1000/- పాలసీ తీసుకొని ఉంటే 20 లక్షల రూపాయలు భీమా వర్తిస్తుంది 3000/- భీమా తీసుకొని ఉంటే 60 లక్షల రూపాయల భీమా వస్తుందని రైతులకు ఖాతాదారులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ ఎల్ సి  కర్రీ శ్రీనివాస్ రావు, మేనేజర్ రమేష్, ఫీల్డ్ ఆఫీసర్ సురేందర్, అకౌంటెంట్ లింగారెడ్డి, క్యాషియర్ శేఖర్ రెడ్డి, జిటీ ఐడిఎస్, ఏరియా మేనేజర్ డి.ఎలీషా బ్యాంకు మిత్ర సుప్రియ క్రాంతి, విబికే  శాంత, ఖాతాదారులు తదితరులు పాల్గొన్నారు.