జిన్నారం మండల స్థాయి ప్రజావాణి
18-08-2026 10:27 AM
జిన్నారం: జిన్నారం మున్సిపల్ కార్యాలయంలో సోమవారం మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలు, వినతులను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ప్రజావాణిలో మొత్తం 2 ఫిర్యాదులు స్వీకరించారు. అందిన ఫిర్యాదులను సంబంధిత అధికారులు పరిశీలించి, నిబంధనల ప్రకారం త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటికి పరిష్కారం చూపేందుకు ప్రజావాణి కార్యక్రమం ఉపయోగకరంగా ఉంటుందని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో జిన్నారం తహశీల్దార్ ఆంథోనీ, మండల విద్యాశాఖ అధికారి విజయ్, జిన్నారం మున్సిపల్ కమిషనర్ నరేందర్, సంబంధిత అధికారులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.






