18 August, 2026 | 11:33 AM

కేజివిపి నూతన భవనాన్ని ప్రారంభించిన మంత్రి వివేక్, ఎంపీ రఘునందన్ రావు

18-08-2026 10:15 AM

చేగుంట: విద్యార్థులు ఇష్టంతో కష్టపడి చదివి, ఉన్నత స్థాయికి ఎదగాలని, పోటీ ప్రపంచంలో పోటీ పడాలని, రాష్ట్ర  కార్మిక శాఖ, జిల్లా ఇంచార్జ్ మంత్రి డ్రాక్టర్ గడ్డం cవెంకట్ స్వామి  అన్నారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ఉపాధ్యాయులు నూతన విద్యా బోధన చేసి భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాలని సూచించారు. సోమవారం చేగుంట  మండలం రెడ్డి పల్లి గ్రామంలో సమగ్ర శిక్షణ ఆధ్వర్యంలో 2 కోట్ల 30 లక్షల రూపాయలతో నిర్మించిన నూతన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం నూతన భవనం, అదనపు తరగతి గదులు, ప్రయోగశాల భవనాలను జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్, ఎంపీ రఘనందన్ రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, దుబ్బక కాంగ్రెస్ పార్టి ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి , సర్పంచ్ నర్సింహా, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంగళ్ రావు తో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి  విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి కంప్యూటర్ విద్య ఎంతో అవసరమని, ప్రపంచంలో మానవుడు తలుచుకుంటే సాధ్యం కాంతి ఏమీ లేదని అన్నారు. గొప్ప చదువులు చదివి సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలని, ప్రతి ఒక్కరికి సంస్కారం, ధ్యానం ఎంతో అవసరమని సూచించారు.ఈ కార్యక్రమం జిల్లా విద్యాధికారి రాజు, మండల పత్రిక అధికారి హేమ భార్గవి, జిల్లా గ్రంధాలయ చైర్మన్ భవాని రెడ్డి, తూప్రాన్ ఆర్డీవో  భవయ్య, తాసిల్దార్  బాల లక్ష్మి, ఎంపీడీవో చిన్నారెడ్డి, వివిధ మండల శాఖ అధికారులు,వివిధ పార్టీ ల మండల అధ్యక్షులు, వివిధ గ్రామాల సర్పంచ్ లు, సినియర్ నాయకులు పాల్గొన్నారు.