22 April, 2026 | 9:10 PM

బంద్ నేపథ్యంలో ఆర్టీసీలో మగవారికి ఉచిత ప్రయాణం..!

22-04-2026 07:40 PM

పెద్దపల్లి,(విజయక్రాంతి): తమ సమస్యలను పరిష్కరించాలని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆర్టీసీ ఉద్యోగులు మంగళవారం ఆర్థరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్లారు. బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దీంతో ఆర్టీసీ యాజమాన్యం విధిలేక కొన్ని ప్రైవేట్‌ బస్సులను ప్రేవేట్‌ డ్రైవర్లతో తిప్పే ప్రయత్నం చేస్తుంది. గోదావరిఖని బస్ డిపోకు చెందిన ప్రైవేట్‌ బస్సుల్లో కండక్టర్‌ లేకపోవటంతో మగవారికి సైతం ఫ్రీ ప్రకటించారు.  బస్సులు లేక బస్టాండ్‌లో గంటల తరబడి వేచి చూడాల్సిప పరిస్ధితి నెల్కోంది. గంట రెండు గంటలకో ఓ ప్రైవేట్‌ బస్సు రావటంతో ప్రయాణికులు పరిగెత్తుతూ బస్సు ఎక్కుతున్నారు.

నిరసన....

తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం పెద్దపల్లి బస్టాండ్‌ వద్ద ఆర్టీసీ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మహిళలకు ఫ్రీ, మగవారికి సైతం ఫ్రీ ఇస్తున్నారు. కానీ ఆర్టీసీ ఉద్యోగులకు వేతనాలు పెంచటమంటే ప్రభుత్వానికి మనస్సు రావటం లేదని మండిపడ్డారు. వెంటనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి, సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు సమ్మె కొనసాగుతుందని తెలిపారు. కార్యక్రమంలో  ఆర్టీసీ ఉద్యోగులు కోటేశ్వర్‌, గోపి, శ్రీనివాస్, లక్ష్మణ్‌, సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.