22 April, 2026 | 9:08 PM

విద్యుత్ వినియోదారుల ఫిర్యాదుల మేరకే పరిష్కార వేదిక

22-04-2026 07:37 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ ఆధ్వర్యంలో ఆపరేషన్ సబ్ డివిజన్ ఎల్లారెడ్డి పరిధిలోని నాగిరెడ్డిపేట్ మండలంలోని బంజర తండ విద్యుత్ సబ్ స్టేషన్లో విద్యుత్ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం బుధవారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు చైర్ పర్సన్ సిజిఆర్ఎఫ్-II టిజి.ఎన్.డి.సి ఎల్ నిజామాబాద్ ఎరుకల నారాయణ,మెంబర్ అఫ్ టెక్నికల్, టిజి.ఎన్.డి.సి.ఎల్ నిజామాబాద్ సలద్ర రామకృష్ణ,నెంబర్ ఆఫ్ ఫైనాన్స్, టిజి.ఎన్.డి.సి.ఎల్ నిజామాబాద్ షేర్ల సత్యనారాయణ, ఫోర్త్ మెంబర్ సిజిఆర్ఎఫ్ నిజామాబాద్ మర్రిపల్లి రాజా గౌడ్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

మండలంలోని ఆయా గ్రామాల నుండి విద్యుత్ వినియోగదారులు, రైతులు, ప్రజలు వారికి విద్యుత్ సమస్యలను వినతి పత్రాల ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. విద్యుత్ వినియోగదారులు, ప్రజలు, రైతులు ఇచ్చినటువంటి దరఖాస్తులను వినతి పత్రాలను అధికారులు స్వీకరించి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. చిన్నపాటి సమస్యలు ఉంటే స్థానిక అధికారుల తెలిపి సమస్యలు పరిష్కారం అయ్యేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా ఎన్నో రోజుల నుండి ఉన్న పెండింగ్ పనులు సత్వరమే పూర్తి చేయడమే ఈ వేదిక ఉద్దేశమని అధికారులు తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాలలో గ్రామపంచాయతీలో ప్రతి విద్యుత్ సమస్యను పరిష్కరించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ డీఈ విజయ సారథి, ఏడిఏ సతీష్ రెడ్డి, ఏఈ నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.