ఏపీలో కొత్త రాజకీయ పార్టీ.. విజయసాయి రెడ్డి సంచలన ప్రకటన!
19-08-2026 11:48 AM
తిరుమల: మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి(Former MP Vijayasai Reddy) బుధవారం తెల్లవారుజామున తిరుమలను సందర్శించారు. స్వామివారిని దర్శించుకుని, అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. తాను త్వరలో ప్రారంభించబోయే రాజకీయ పార్టీ విజయవంతంగా ఆవిష్కృతం కావాలని ప్రార్థించినట్లు విజయసాయిరెడ్డి తెలిపారు. ప్రజలు తమ సమస్యలను వెల్లడించడానికి ఈ పార్టీ ఒక వేదికగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అందరి శ్రేయస్సు కోసం తాను ప్రార్థించానని, అలాగే రాష్ట్రంలో 'ఎల్ నినో' ప్రభావం తగ్గి వర్షపాతం పెరుగుతుందని ఆశిస్తున్నానని కూడా ఆయన అన్నారు. ఈ నెలలోనే తదుపరి రాజకీయ ప్రణాళిక ప్రకటించనున్నట్లు తెలిపారు.






