ఒక ఫోటో... వెయ్యి పదాల భావాన్ని వ్యక్తం చేస్తుంది
తిరుమలగిరి మార్కెట్ చైర్మన్ సంకేపల్లి రఘునందన్ రెడ్డి
తుంగతుర్తి,(విజయక్రాంతి): తిరుమలగిరి మండల కేంద్రంలో ఫోటోగ్రాఫిక్ డే సందర్భంగా ఫోటోగ్రాఫర్(World Photography Day) యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని,జెండా ఆవిష్కరణ చేసి శుభాకాంక్షలు తెలియజేసిన తిరుమలగిరి మండల ఫోటోగ్రాఫర్ యూనియన్ గౌరవ అధ్యక్షులు,తిరుమలగిరి మున్సిపల్ చైర్మన్ సంకేపల్లి రఘునందన్ రెడ్డి మాట్లాడుతూ... ఒక మంచి ఫొటో వెయ్యి పదాల భావాన్ని క్షణాల్లో వ్యక్తపరుస్తుంది.
సమాజంలోని మార్పులను, ప్రకృతి ఒడిలోని అద్భుతాలను,మనుషుల చిరునవ్వులను,కన్నీళ్లను రాబోయే తరాలకు అందించడంలో ఫొటోగ్రాఫర్ల పాత్ర అనితరసాధ్యమైనది.ప్రమాదకర పరిస్థితుల్లో, యుద్ధ రంగాల్లో కూడా తమ ప్రాణాలను పణంగా పెట్టి నిజాలను మన ముందుకు తెచ్చే ప్రెస్ ఫొటోగ్రాఫర్ల ,శ్రమ అభినందనీయం. ఫొటోగ్రఫీ కళకు తమ జీవితాన్ని అంకితం చేసినకళాకారులందరికీ మరొకసారి నాహృదయపూర్వకనమస్కారాలు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫోటో గ్రాఫర్స్ యూనియన్ ఉపాధ్యక్షుడు యాదగిరి,సుధీర్,నరేష్ గౌడ్,పరుషరాములు,అర్జున్,అశోక్, సన్నీ,కిష్టు నాయక్,లాలూ,గంగాధర్,భాస్కర్,రాజు తదితరులు పాల్గొన్నారు.






