5 April, 2026 | 11:30 AM

పాక్‌లో పెట్రోల్‌పై రూ.80 తగ్గింపు

05-04-2026 01:17 AM
  1. ప్రజాగ్రహంతో 24 గంటల్లోనే వెనక్కు

రాత్రికి రాత్రే ప్రకటించిన ప్రధాని షెహబాజ్ 

ఇస్లామాబాద్, ఏప్రిల్ 4: పెట్రోల్ ధరల పెంపుపై పాక్‌లో ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతుండడంతో ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఉప శమన చర్యలకు ఉపక్రమించారు. పెట్రోల్ ధరలను రూ. 80 (పీకేఆర్)కు తగ్గిస్తున్నట్లు అర్థరాత్రి ప్రకటించారు. పశ్చిమాసియా ఉ ద్రిక్తతల నేపథ్యంలో గురువారం పాక్ ఇంధ న ధరలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌పై 43 శాతం, డీజిల్‌పై 55 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది.

దాంతో పెట్రోల్ ధర రూ. 458 (పీకేఆర్)కు పెరిగింది. ఇది ప్రజల్లో మరింత ఆగ్రహానికి కారణమైంది. ఈ క్రమంలో అర్థరాత్రి ప్రధా ని షెహబాజ్ షరీఫ్ పెట్రోల్ పై రూ. 80 (పీకేఆర్) తగ్గిస్తున్నట్లు ఇక నుంచి లీటర్ కు రూ. 378 (పీకేఆర్) లభిస్తుందన్నారు. ఒక నెలపాటు ధరలో ఎలాంటి మార్పు ఉండదని హామీ ఇచ్చారు. పశ్చిమాసియాలో సం ఘర్షణలే ధరల పెరుగుదలకు కారణమన్నారు. వీటి నియంత్రణకు తమ ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుందన్నారు.