అప్పు తిరిగి చెల్లించండి
- పాకిస్థాన్‌కు యూఏఈ ఆదేశం
చెల్లింపులెలా తర్జనభర్జనలో పాక్
ఇరాన్‌కు మద్దతు ప్రకటనే కారణమా?
న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: పాకిస్థాన్ తీసుకున్న అప్పును ఈ నెలాఖరు కల్లా తిరిగి చెల్లించాలని యూఏఈ కోరింది. పశ్చిమాసియా ఉ ద్రిక్తతల నేపథ్యంలో యూఏఈ ఆర్థిక ఇబ్బందులను తగ్గించుకునేందుకు ఈ అడుగు వేసి నట్లు సమాచారం. అప్పును చెల్లించేందుకు పాక్ తర్జనభర్జన పడుతున్నట్లు తెలుస్తుంది. ఏప్రిల్‌లో 3.5 బిలియన్ డాలర్ల రుణాన్ని చెల్లించాలని నిర్ణయించి షెడ్యూల్ చేసింది. ఏప్రిల్ 11న 450 మిలియన్ డాలర్లు, ఏప్రి ల్ 17న 2 బిలియన్ డాలర్లు, ఏప్రిల్ 23న 1 బిలియన్ డాలర్లను చెల్లించనున్నట్లు సమాచారం.
కాగా 1.3 బిలియన్ డాలర్ల యూరో బాండ్‌ను కూడా చెల్లించాల్సి ఉంది. దీంతో యూఏఈకి పాక్ ఏప్రిల్ నెలలోనే 4.8 బిలియన్ డాలర్లను చెల్లించాల్సి ఉంటుంది. పాక్ వద్ద 16.4 బిలియన్ డాలర్ల విదేశీ మారక నిల్వలు మాత్రమే ఉన్నాయి. ఇందులో యూఏఈ, సౌదీ అరేబియా, చైనా నుంచి వచ్చిన డిపాజిట్లే ఎక్కువ. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధంలో ఇరాన్‌కు పాక్ మ ద్దతు ప్రకటించింది. దీంతో యూఏఈ తీవ్ర అసంతృప్తితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తె లుస్తుంది. ఈ రుణాన్ని చెల్లిస్తే పాక్‌కు ఆర్థిక సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.




