21 March, 2026 | 6:35 PM

గోదావరి పుష్కరాలకు రూ.500 కోట్లు

21-03-2026 01:49 AM

వచ్చే ఏడాదిలో వైభవంగా నిర్వహించేలా విస్తృత ఏర్పాట్లు

హైదరాబాద్, మార్చి 20 (విజయక్రాంతి): పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే, అత్యంత ప్రతిష్టాతత్మకంగా నిర్వహించే గోదావరి పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.500 కోట్లు కేటాయించింది. వచ్చే ఏడాది 2027 జూన్ 26 జూలై 7 వరకు ఈ పుష్కరాలు జరగనున్నాయి. 8 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారని అధికారులు అంచనా వేస్తున్న నేపథ్యంలో దానికనుగుణంగా బడ్జెట్‌లో కేటాయింపులు చేశారు. కుంభమేళా తరహాలో ఈ పుష్కరాలను నిర్వహించేలా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.

భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రోడ్ల విస్తరణ, కొత్త ఘాట్ల నిర్మాణం, దేవాలయాల అభివృద్ధి వంటి మౌలికసదుపాయాల పనులను వేగంగా చేపడుతున్నారు. ఈ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు మంత్రి డీ.శ్రీధర్ బాబు నేతృత్వంలో ప్రత్యేక క్యాబినెట్ సబ్ కమిటీని ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాటు చేసింది. భక్తులకు ఇబ్బందుల్లేకుండా దర్శనం, భద్రత, రవాణా సౌకర్యం, రద్దీ నియంత్రణ కోసం ఈసారి ఆధునిక సాంకేతికతను వినియోగించనున్నారు. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడే లా, భక్తులకు ఏమాత్రం ఇబ్బందులు కలగకుండా ఉండేలా పుష్కరాలను నిర్వహించేం దుకు రూ.500 కోట్లను కేటాయించారు.