హైదరాబాద్ ను ఉర్రూతలూగించనున్న రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్
హైదరాబాద్, ఆగస్టు 15: హైదరాబాద్ వాసులకు అద్భుతమైన వినోదాన్ని అందించేందుకు ‘రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్’ మ్యూజిక్ ఫెస్టివల్ సరికొత్త ఉత్సాహంతో సిద్ధమైంది. 2026 ఆగస్ట్ 22న హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ఈ భారీ వేడుక నిర్వహించనున్నారు. ‘లివింగ్ ఇట్ లార్జ్’ భావనకు నిదర్శనంగా నిలిచే ఈ ఈవెంట్, మధ్యాహ్నం 3 గంటల నుంచే ప్రేక్షకులకు మైమరిపించే అనుభూతిని అందించనుంది. బాలీవుడ్ సూపర్ హిట్ పాటలకు, హిప్-హాప్ సంగీతపు ఊపును జోడించి రూపొందించిన ఈ ఒరిజినల్ సౌండ్ ఫెస్టివల్ కేవలం సంగీతానికే పరిమితం కాకుండా గేమింగ్, సమకాలీన పాప్ సంస్కృతి కలబోతగా సరికొత్త ప్రత్యక్ష వినోద అనుభవాన్ని అందించబోతోంది.
ఈ గ్రాండ్ మ్యూజిక్ ఫెస్టివల్‌లో అంతర్జాతీయంగా పేరుపొందిన ఫ్రెంచ్ మోంటానాతో పాటు టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖ గాయకులు ఎల్.వి. రేవంత్, నిఖిత గాంధీ, ప్రముఖ డిజే సాహిల్ గులాటీ మరియు పాయల్ ధరేల ఉత్కంఠభరిత ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. వీరి పాటలు, డ్యాన్స్ అండ్ గేమింగ్ హంగామాతో గచ్చిబౌలి స్టేడియం ఉర్రూతలూగడం ఖాయమని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ అద్భుతమైన ఈవెంట్ ప్రత్యక్ష ప్రదర్శనలను వీక్షించాలనుకునే వారి కోసం ‘స్కిల్ బాక్స్’ వేదికగా టిక్కెట్లు అందుబాటులో ఉంచబడ్డాయి.






