26 April, 2026 | 6:55 PM

Breaking News

కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి   •   శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే కందాళ   •   ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు   •   నిరుద్యోగ సమస్యలను పరిష్కారించటంలో కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు విఫలం   •   కొత్త కలెక్టర్ కు స్వాగతం   •   ఖాకీలపై నాయీల నిరసనల వెల్లువ   •   శ్రీ వాసవి మాత అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి   •   డీజిల్ పెట్రోల్ కొరత లేకుండా చూడాలి: సిపిఐ డిమాండ్   •   ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన బిజెపి నేతలు   •   ఖానాపూర్ మున్సిపాలిటీకి ఉపాధి పనులు పునరుద్ధరించండి   •  

రోటరీ, ఆపీ సేవలు అభినందనీయం

07-10-2025 12:51 AM

ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్

జగిత్యాల అర్బన్, అక్టోబర్ 6 (విజయ క్రాంతి): జగిత్యాల ప్రాంతంలో రోటరీ క్లబ్, ఆపీ స్వచ్ఛంద సంస్థల సేవలు అభినందనీయమని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు.రోటరీ జిల్లా 3150 డిస్ట్రిక్ట్ గవర్నర్ డా. ఎస్ వి రాంప్రసాద్ జగిత్యాల పర్యటన సందర్భంగా జిల్లా కేంద్రంలోని దరూర్ క్యాంపు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థుల కోసం సోమవారం జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ చేతులమీదుగా వాటర్ ప్యూరీఫైయర్ ప్లాంట్ ను రోటరీ క్లబ్ - ఆపి ఆధ్వర్యంలో అందజేసింది.

ఈకార్యక్రమంలో ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్, రోటరీ జిల్లా 3150 డిస్ట్రిక్ట్ గవర్నర్ డా ఎస్ వి రాంప్రసాద్ తో పాటు రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ మంచాల కృష్ణ, అధ్యక్షులు చారీ, సెక్రటరీ ఎన్. రాజు, పూర్వ అధ్యక్షులు సిరిసిల్ల శ్రీనివాస్, కొత్త ప్రతాప్, పి.సాగర్, సూర్యం, సభ్యులు సురేందర్ రావు, కాశీరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు అమర్ నాథ్ రెడ్డి, పి ఆర్ టీ యూ జిల్లా అధ్యక్షుడు ఆనంద్ రావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ మాట్లాడుతూ, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు తోడుగా స్వచ్ఛంద సంస్థల సహకారం ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇందులో భాగంగానే జగిత్యాల ప్రాంత ప్రజలకు అవసరమైన రీతిలో అనేక సామాజిక కార్యక్రమాలను గత 4 దశాబ్దాలనుండి నిర్వహిస్తున్నామన్నారు.

స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న సామాజిక కార్యక్రమాలపట్ల ఎన్ని విమర్శలు, ఎన్ని అభినందనలు వచ్చినా, అవేవీ పట్టించుకోకుండా, అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ, శాసన సభ్యుడిగా, రొటేరియన్ గా తమవంతు బాధ్యతలను నిర్వర్తిస్తున్నామని వివరించారు.రోటరీ జిల్లా 3150 డిస్ట్రిక్ట్ గవర్నర్ డా. ఎస్ వి రాంప్రసాద్ మాట్లాడుతూ, అంతర్జాతీయ సంస్థ రోటరీ ద్వారా నిర్వహిస్తున్న సామాజిక కార్యక్రమాల్లో ప్రధానంగా, పల్స్ పోలీయో కార్యక్రమం అని వివరించారు.