6 July, 2026 | 4:09 PM

Breaking News

ఎకో టూరిజం అభివృద్ధి చేయాలి: సీఎం రేవంత్​ రెడ్డి   •   ప్రజావాణి దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలి   •   8వ రోజుకు చేరిన సింగరేణి అధికారుల రిలే నిరాహార దీక్షలు   •   సుల్తానాబాద్ లో జగ్జీవన్ రామ్ కు ఘనంగా నివాళులు   •   ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం   •   విద్యార్థులను పరామర్శించిన ఆర్సీవో సత్యనాథ్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు   •   ధర్మారం పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన సర్పంచ్ బాలాజీ   •   108, 102 వాహన సేవలను సద్వినియోగపరచుకోండి: వైద్యాధికారి రమేష్   •   ప్రభుత్వ హాస్టల్ సమస్యలపై ప్రజావాణిలో ఆర్డీఓకి వినతి   •   ప్రభుత్వ పాఠశాలలో పెన్నులు, బుక్స్ పంపిణీ   •  

గులాబీ, హస్తం ఫైట్!

14-02-2026 12:00 AM
  1. హోరాహోరీగా ఫలితాలు.. ప్రతీ రౌండ్‌లో ఉత్కంఠ 
  2. మెదక్‌లో బీఆర్‌ఎస్ 15, కాంగ్రెస్ 14, బీజేపీ 2, బీఎస్పీ 1
  3. తూప్రాన్‌లో బిఆర్‌ఎస్ 9, కాంగ్రెస్ 4, బీజేపీ 2..
  4. నర్సాపూర్ లో..కాంగ్రెస్ 6, బీఆర్‌ఎస్ 5, బీజేపీ 4
  5. రామాయంపెట్ లో కాంగ్రెస్ 8, బిఆర్‌ఎస్ 3, బీజేపీ 1
  6. మెదక్‌లో కీలకంగా మారనున్న బీజేపీ అభ్యర్థులు

మెదక్, ఫిబ్రవరి 13 (విజయ క్రాంతి) : మెదక్ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీ లో శుక్రవారం ఓట్ల లెక్కింపు ప్రక్రియ హోరా హోరీగా కొనసాగింది. ప్రతీ రౌండ్ లో తీవ్ర ఉత్కంఠత మధ్య సాగింది. మెదక్ జిల్లాలోని మెదక్ మున్సిపాలిటీ లో 32 వార్డులు, తూప్రాన్ లో 16 వార్డులు, నర్సాపూర్‌లో 15 వార్డులు, రామాయంపెట్‌లో 12 వార్డులకు సంబంధించి కౌటింగ్ ప్రారంభమైంది. 8 గంటలకు కౌటింగ్ ప్రారంభం కాగా ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. మెదక్ లో బీఆర్‌ఎస్ 15 సీట్లు కైవసం చేసుకోగా, కాంగ్రెస్ 14 సీట్లు, బీజేపీకి 2 సీట్లు, బీఎస్పీ ఒక సీటు గెలిచాయి.

అలాగే తూప్రాన్ మున్సిపల్ ఎన్నికల భాగంగా 16 వార్డులకు ఎన్నికలను లెక్కించగా అధికంగా బిఆర్‌ఎస్ అభ్యర్థులు 9, కైవసం చేసుకోగా, కాంగ్రెస్ 4, బిజెపి 2 సీట్లు గెలిచాయి. రామాయం పెట్ మున్సిపల్ లో 12 వార్డులకు కాంగ్రెస్ 8, బిఆర్‌ఎస్ 3, బీజేపీ 1 సీట్లు గెలిచాయి. నర్సాపూర్ మున్సిపల్ లో 15 వార్డులకు గాను కాంగ్రెస్ 6, బీఆర్‌ఎస్ 5, బీజేపీ 4 సీట్లు గెలిచాయి.

కీలకంగా మారనున్న బీజేపీ అభ్యర్థులు..

మెదక్ మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ అభ్యర్థులు కీలకంగా మారనున్నారు. చైర్మన్ పీఠం కైవసం చేసుకోవాలంటే అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతి పక్ష పార్టీ బిఆర్‌ఎస్ కు బీజేపీ అభ్యర్థులతో పాటు ఒకరు బీఎస్పీ అభ్యర్థి మద్దతు ఇస్తేనే చైర్మన్ పీఠం దక్కే అవకాశం ఉంది.