ప్రగతి ప్రణాళికలో రోడ్డు భద్రతా వారోత్సవాలు
13-04-2026 02:15 PM
లక్ష్మణ చందా (విజయ క్రాంతి): లక్ష్మణ చందా మండలంలోని చామన్ పెల్లి గ్రామ పంచాయతీ వద్ద ఏర్పాటు చేసిన గ్రామ సభలో 99 రోజుల ప్రజా పాలనా- ప్రగతి ప్రణాళిక లో భాగంగా రోడ్డు భద్రత వారోత్సవాలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్డు భద్రత అంశాలపై చర్చించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ అయిట్ల లక్ష్మి సుదర్శన్ ఉప సర్పంచ్ గంగారెడ్డి వార్డు సభ్యులు ఆశ వాలంటీర్ అంగన్వాడీ టీచర్ ఏఎన్ఎం వార్డు సభ్యులు మహిళలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు




