25 March, 2026 | 11:51 PM

తంగళ్ళపల్లిలో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం

25-03-2026 10:03 PM

తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని తాడూరు ఎక్స్ రోడ్ వద్ద తంగళ్ళపల్లి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత మరియు ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని తంగళ్ళపల్లి ఎస్సై ఉపేంద్ర చారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనదారులకు ట్రాఫిక్ నియమాలు పాటించాల్సిన అవసరం, హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ వినియోగం వంటి ముఖ్య సూచనలు తెలియజేశారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించడంలో ప్రజల పాత్ర ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తంగళ్ళపల్లి పోలీస్ సిబ్బంది పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు.