25 March, 2026 | 11:47 PM

మార్కెట్ లోకి స్కోడా కుషాక్ కొత్త వెర్షన్

25-03-2026 10:21 PM

ముంబై, మార్చి 25: కార్ల మార్కెట్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్కోడా సంస్థ ఎప్పటికప్పుడు కొత్త వెర్షన్లను పరిచయం చేస్తోంది. గతంలో విశేష ఆదరణ పొందిన మోడల్స్ ను ఆధునీకరించి సరికొత్తగా మార్కెట్ లోకి తీసుకొస్తోంది. దీనిలో భాగంగా రిఫ్రెష్డ్ మరియు అప్‌గ్రేడెడ్ సరికొత్త కుషాక్ ను విడుదల చేసింది.  సరికొత్తగా ఆవిష్కరించబడిన కొత్త కుషాక్ విలువ, భద్రత మరియు డ్రైవింగ్ డైనమిక్స్‌లో సరికొత్త ప్రమాణాలను నెలకొల్పడమే కాకుండా, యూరోపియన్ టెక్నాలజీని అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే బ్రాండ్ వ్యూహాన్ని మరింత ముందుకు తీసుకెళ్తోంది.

సెగ్మెంట్-ఫస్ట్ ఎయిట్-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్,  రియర్ సీట్ మసాజర్ మరియు అనేక కొత్త స్టాండర్డ్ ఫీచర్లతో వస్తున్న కొత్త కుషాక్ 1.0 టీఎస్ఐ మరియు 1.5 టీఎస్ఐ వేరియంట్లు, యూరోపియన్ ఇంజనీరింగ్ 5-స్టార్ భద్రతను భారతీయ రోడ్లపై మరింత చేరువ చేస్తున్నాయని కంపెనీ తెలిరింది. కొత్త కుషాక్ ఇప్పుడు క్లాసిక్ ప్లస్, సిగ్నేచర్, స్పోర్ట్ లైన్, ప్రెస్టీజ్ మరియు మాంటే కార్లో అనే ఐదు ట్రిమ్స్‌లో లభిస్తుంది. ఇవి టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్లతో పాటు మాన్యువల్ మరియు రియల్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లను అందిస్తున్నాయి. క్యాండీ వైట్, కార్బన్ స్టీల్, బ్రిలియంట్ సిల్వర్, లావా బ్లూ, డీప్ బ్లాక్ మరియు సరికొత్తగా పరిచయం చేసిన షిమ్లా గ్రీన్, స్టీల్ గ్రే, మరియు చెర్రీ రెడ్ రంగుల్లో అందుబాటులో నఉన్నాయి.

యూరోపియన్ టెక్నాలజీని అందరికీ చేరువ చేయడమే తమ లక్ష్యమని ,కొత్త కుషాక్ తో ప్రతి వేరియంట్‌లోనూ వాల్యూకి సరికొత్త అర్థాన్ని ఇచ్చామనీ స్కోడా ఆటో ఇండియా బ్రాండ్ డైరెక్టర్ ఆశిష్ గుప్తా చెప్పారు. కొత్త కుషాక్  ప్రత్యేకమైన టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ లైన్-అప్‌ను కొనసాగిస్తోందని వెల్లడించారు. అత్యుత్తమ పనితీరును కోరుకునే కస్టమర్ల కోసం, 1.5 టీఎస్ఐ ఇంజన్ 110 పవర్ మరియు 250 ఎన్ఎం టార్క్‌ను అందిస్తుందని వివరించారు. ఇది కేవలం సెవెన్-స్పీడ్ DSG ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే అందుబాటులో ఉంటుందన్నారు.