25 March, 2026 | 11:46 PM

పెద్దమల్లారెడ్డిలో వరి పంట నష్టం పరిశీలన

25-03-2026 10:19 PM

భిక్కనూర్,(విజయక్రాంతి): భిక్కనూర్ మండలం పెద్దమల్లారెడ్డి గ్రామంలో ఇటీవల కురిసిన వడగళ్ల వానతో సుమారు 500–600 ఎకరాల్లో వరి పంట నష్టపోయింది. వడగళ్ల ప్రభావంతో పంటలు నేలకూలి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ నేపథ్యంలో డీఏఓ మోహన్ రెడ్డి గ్రామాన్ని సందర్శించి నష్టపోయిన పంట పొలాలను పరిశీలించారు. కార్యక్రమంలో సర్పంచ్ కోడూరి సాయగౌడ్, ఉపసర్పంచ్ చైతన్య కొండలరెడ్డి, పంచాయతీ కార్యదర్శి, గ్రామ పాలకవర్గ సభ్యులు, రైతులు, పాల్గొన్నారు. పంట నష్టం అంచనా వేసి రైతులకు తగిన పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు.