15 June, 2026 | 2:38 PM

Breaking News

పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •   మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఫిషరీస్ భూమి సర్వే పూర్తి   •  

కోతకు గురైన రోడ్డు.. రాకపోకలకు ఇబ్బంది

06-11-2025 12:00 AM

 వెల్దండ, నవంబర్ 4: మండల పరిధిలోని బైరాపూర్ వాగులో నిర్మించిన కల్వర్టు కోతకు గురై రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. బుధవారం కురిసిన వర్షాలకు వాగు ఉధృతి పెరిగి బైరాపూర్ గ్రామ సమీపంలోని కల్వర్టు  వరద ఉధృతికి కోతకు గురైంది. ఇటీవలనే రోడ్డు  దెబ్బతిని వాహనాల రాకపోకలు స్తంభించాయి.

గ్రామస్తులు ఇటీవల తాత్కాలిక మరమ్మతులు చేపట్టి రాకపోకలు ఇబ్బంది లేకుండా చేశారు. మంగళ బుధవారం కురిసిన వర్షాలకు  వరద ఉధృతి పెరిగి రోడ్డు కోతకు గురైంది. దీంతో వాహనాల రాకపోకలు స్తంభించి ప్రయాణికులు కాలినడకన వెళ్తున్నారు. అధికారులు చొరవ తీసుకొని రోడ్డు మరమ్మతులు చేపట్టి వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చేయాలని పలు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.