24 August, 2026 | 2:54 AM

మోహన్‌రావు నగర్ కాలనీలో మళ్లీ రోడ్డు ఆక్రమణ

24-08-2026 02:03 AM

మేడ్చల్, ఆగస్టు 23 (విజయ క్రాంతి): జవహర్ నగర్ చంద్రపురి డివిజన్ పరిధిలో ని మోహన్ రావు నగర్ కాలనీలో 20 అడుగుల పబ్లిక్ రోడ్డు మళ్లీ ఆక్రమణకు ప్రయ త్నాలు జరుగుతున్నాయి. రేకులు వేసి కంటైనర్ ఏర్పాటు చేసినట్లు స్థానికులు తెలిపారు. ఇంతకుముందు కూడా ఆక్రమణకు ప్రయత్నించగా ఆర్‌ఐ వచ్చి చదును చేయించి వె ళ్లారు. 100 ఫీట్ల రోడ్డు నుంచి కాలనీకి వెళ్లే రోడ్డును తమ ప్లాటుగా చెప్పుకుంటూ తర చు కబ్జాకు ప్రయత్నిస్తున్నారు. రోడ్డును కబ్జా చేయడం వల్ల అటువైపే వెళ్లే కాలనీలా వారు ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల రోడ్డు కబ్జా విషయమై కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. రోడ్డు కబ్జా కాకుండా చూడాలని వారు కోరుతున్నారు.