18 July, 2026 | 1:17 PM

Breaking News

Skyroot Vikram-1: స్కైరూట్ విజయం.. దేశయువతకు స్ఫూర్తి   •   సైబరాబాద్‌వ్యాప్తంగా ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు   •   Skyroot Vikram-1 విజయవంతం.. దేశ రోదసీ చరిత్రలో సరికొత్త అధ్యాయం   •   పైకప్పు కారుతోంది.. ప్లాస్టిక్ పట్టాలే దిక్కు!   •   వాతావరణ మార్పు అనేది దూరపు ముప్పు కాదు, సజీవ వాస్తవం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి   •   సబితా ఇంద్రారెడ్డి, RS ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్   •   బండ రామారం పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తాం   •   బీఆర్ఎస్‌ యువ సంగ్రామ సభ.. ఎక్కడికక్కడే పోలీసుల అరెస్ట్‌లు   •   Sonam Wangchuk: వాంగ్‌చుక్ దీక్షకు బ్రేక్.. కేంద్రంపై పవార్ విమర్శలు   •   చారిత్రక జామా మసీదు విస్తరణకు శంకుస్థాపన   •  

దుశ్చర్లపై చర్యలు తీసుకోవాలని రాస్తా రోకో

24-04-2026 08:32 PM

మోతె,(విజయక్రాంతి): తమపై అమానుషంగా దాడి చేసిన దుశ్చర్ల సత్యనారాయణపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శుక్రవారం మండల కేంద్రంలోనీ ఎస్బిఐ బ్యాంకు సమీపంలో సూర్యాపేట ఖమ్మం రహదారిపై గాయమైన కాలితో బాధితుడు లింగయ్య తన కుటుంబ సభ్యులతో కలిసి సుమారు అరగంట పాటు రాస్తారోకో నిర్వహించారు. అనంతరం లింగయ్య కుటుంబ సభ్యులు మాట్లాడుతూ దుశ్చర్ల సత్యనారాయణ అటవీ గెట్టు మా గెట్టు ప్రక్క పక్కనే ఉన్నారు.

అయితే మూగ జీవాలు మేస్తుండగా మేము కాస్త దూరంలో ఉన్న సమయంలో మేకలు, గొర్రెలు ఆయన అటవీ భూమిలోకి వెళుతుండగా వాటిని బయటకు తరిమి వేస్తూ లింగయ్య, మేకల కృష్ణయ్యలపై తన చేతిలోని కర్రతో చితక బాదాడన్నారు. పక్కన ఉన్న వారి సమాచారం మేరకు మేము అక్కడకు చేరుకోగానే ఆయనకు సంబంధించిన అనుచరులు కర్రలతో రాళ్ళతో మాపై దాడి చేయగా గాయాలయ్యాయన్నారు. దీంతో చేసేదేమీలేక మా రక్షణ కోసం తిరిగి దాడి చేయాల్సి వచ్చిందన్నారు. తరువాత నేరుగా పోలీస్ స్టేషన్ కు పోయి పిర్యాదు చేసిన మమ్మల్ని పట్టించుకోలేదని ఆరోపించారు.

వన్య ప్రాణులకోసం అటవీని పెంచిన ఆయన మూగ జీవాలు మేతకు వెళితే మాపై ఎందుకు అంత కోపంతో రాక్షసుడిలా కర్రతో విచక్షణ కోల్పోయి దాడి ఎందుకు చేశాడో చెప్పాలన్నారు. పోలీసులు సైతం మాపై కక్ష సాధింపు చర్యలు చేయడం సరికాదన్నా. విషయం తెలుసుకున్న మోతె యస్ఐ అజయ్ కుమార్ అక్కడికి చేరుకుని రాస్తారోకోను విరమింపజేసి స్టేషన్ కు తరలించారు. ఈ కార్యక్రమంలో బాధితకుటుంబ సభ్యులు మల్లయ్య, గంగయ్య, వీరన్న, గణేష్, వెంకట్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.