డ్రంక్ అండ్ డ్రైవ్... రూ.2.65 ఫైన్
24-04-2026 08:36 PM
సిద్దిపేట క్రైం: సిద్దిపేటలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 26 మంది మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారని ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. శుక్రవారం వారిని సిద్దిపేట స్పెషల్ సెకండ్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కాంతారావు ఎదుట హాజరుపరిచినట్టు చెప్పారు. న్యాయమూర్తి విచారణ జరిపి 26 మందికి కలిపి రూ.2లక్షల 65 వేలు జరిమానా విధించారని పేర్కొన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతూ పట్టుబడిన నలుగురికి రూ.20 వేలు జరిమానా విధించారని సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు.






