22 June, 2026 | 12:13 PM

వాన దేవుడి కరుణ కోసం.. గ్రామ దేవతలకు జలాభిషేకం

22-06-2026 10:49 AM

ఉట్నూర్, జూన్ 22(విజయక్రాంతి): వానాకాలం ప్రారంభమై  పక్షం రోజులు దాటిన  చిలకమ్మ జాడ లేకపోవడంతో వరణ దేవుడి కరుణ కోసం గ్రామ దేవతలకు జలాభిషేకం చేస్తున్నారు. సోమవారం ఉదయం ఉట్నూర్ ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన గ్రామాల ప్రజలు వేకువ జాము నుండి  మహిళలు పురుషులు బిందెల్లో నీళ్లు తీసుకువెళ్లి  గ్రామ దేవతలైన హనుమాన్, పోచమ్మ తల్లులకు  జలాభిషేకం చేస్తూ  వానదేవుడు కరుణించాలని పూజలు చేస్తున్నారు.