22 June, 2026 | 12:13 PM

దుబ్బగూడెంలో కార్డెన్ సెర్చ్

22-06-2026 10:56 AM

ప్రజల భద్రతే పోలీసుల లక్ష్యం 

బెల్లంపల్లి ఏసిపి కిరణ్ కుమార్

భీమిని, (విజయక్రాంతి): ప్రజల భద్రతే పోలీసుల లక్ష్యమని బెల్లంపల్లి ఏసీపి కిరణ్ కుమార్ అన్నారు. మంచిర్యాల జిల్లా భీమిని మండలంలోని దుబ్బ గూడెం గ్రామంలో కార్డెన్ సర్చ్ నిర్వహించి ప్రజలనుద్దేశించి మాట్లాడారు. భద్రతే పోలీసుల లక్ష్యమని, శాంతి భద్రతల దృష్ట్యా గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్క వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలనీ, యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.

ప్రతి ఒక్కరు సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. నకిలీ పత్తి విత్తనాలపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు తెలిపారు. రైతులు ప్రభుత్వ ఆమోదితం పొందిన విత్తనాలను కొనుగోలు చేయాలన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్డన్ సెర్చ్ లో 60 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు, టాటా ఏస్ వానల పత్రాలను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో తాండూర్ సీఐ దేవయ్య, బెల్లంపల్లి తాళ్ల గురీజాల, భీమిని, కన్నెపల్లి, నెన్నెల ఎస్సైలు, సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.