పాలెపు రాము ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు
ముఖ్య అతిథిగా పాల్గొన్న బిజెపి రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు
ఖమ్మం టౌన్ (విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి పాలెపు రాము జన్మదినాన్ని పురస్కరించుకొని ఆదివారం డివిజన్ ప్రజలకు ఖమ్మం లో ఉచిత కంటి పరీక్ష కేంద్రాన్ని నిర్వహించారు. ఈ కంటి పరీక్ష కేంద్రాన్ని బిజెపి రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవ రావు ముఖ్యఅతిథిగా పాల్గొని స్థానిక 1 టౌన్ అధ్యక్షులు గడిల నరేష్ తొ కలిసి ప్రారంభించటం జరిగింది. అలాగే భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుమేరకు ప్రతిఒక్కరు అమ్మ పేరుతో మొక్కను నాటాలని ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు పర్యవేక్షణ లో మొక్కలను నాటటం జరిగిందిని రాము తెలిపారు.
తన పుట్టిన రోజు సందర్భంగా 39 వ డివిజన్ నందు మాక్సి విజన్ వారి సౌజన్యం తొ ఈ శిభిరం ఏర్పాటు చేశామని, ప్రపంచం యోగ దినోత్సవం రోజు తన పుట్టినరోజు కావటం సంతోషం గా ఉందన్నారు. డివిజన్ అభివృద్ధి కి నిరంతరం శ్రామిస్తానన్నారు. ఈ కార్యక్రమం లో జిల్లా ఉపాధ్యక్షులు వీరవెల్లి రాజేష్ గుప్తా, రవి రాథోడ్, జిల్లా నాయకులు పొట్టిమూతి జనార్దన్, తుమ్మ శివ, బండ్ల రిగాన్, మేడ సంపత్ మండల నాయకులు పొట్టిమూతి వాణి, కడుదుల ప్రభాకర్, నాయిడు శేఖర్, మరిమెల్ల రామకృష్ణ, వాళ్ళల రమేష్, బి.ఎలిశెట్టి మణికంఠ తది రులు పాల్గొన్నారు






