ఫుట్ పాత్ ఆక్రమణలు తొలగించాలి
22-06-2026 11:48 AM
ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ అంకం మౌనిక మహేందర్
ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఆర్టీసీ బస్టాండ్ చుట్టూ, పాత బస్టాండ్ ,ప్రధాన రహదారి పక్కల ఉన్న ఫుట్ పాత్ ఆక్రమణలను యజమానులే తొలగించాలని ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ అంకం మౌనిక మహేందర్ అన్నారు. ఈ మేరకు సోమవారం ఆమె మున్సిపల్ సిబ్బందితో కలిసి ఫుట్పాత్ ఆక్రమణలను, రహదారిని పరిశీలించారు. ప్రయాణికులు, ప్రజల విజ్ఞప్తి మేరకు యజమానులు స్వచ్ఛందంగా సిబ్బందికి సహకరించాలని వారు కోరారు. ఆమె వెంట నాయకులు బిజెపి నియోజకవర్గ కన్వీనర్ అంకం మహేందర్, బండి పల్లి ప్రకాష్, ఎనగందుల నారాయణ, తదితరులు ఉన్నారు.






